దశరా శుభాకాంక్షలు... "కందం"ల ప్రయత్నము
*************************************************
అమరము కొరకు తపము కఠి
నము జలిపెను, మహిష గుణమున కమలజుడికై
సుమతిని వినిన యజితుడనె
"యమరము నసువులకు వలదు యటునెటు మహిషా?
గిట్టక తప్పదు నెప్పుడు
పుట్టిన ప్రాణులు, తదుపరి పుట్టెను మరలా!
యెట్టి వరము మహిష, విడిచి
పెట్టుము యొక మార్గము నది భిన్నము యగునా?"
మహిషాసురుడు:
నేడా నే నాశపడుట,
వీడెద నొక మార్గము నిటు విధుడి కొరకునన్,
కీడు గలుగు పురుషులతో,
యాడుది నా దృష్టినందు యబల విడిచెదన్.
బ్రహ్మ:
పురుషుడు నందున యెపుడును
మరణము పొందవు, వరమిది, మహిషాసురుడా!
కరుణని జూపుచు మెలుగుము
వరమును స్వార్ధమున కెపుడు వ్యర్ధమవకనే!
వరగర్వితుడై మహిషా
సురుడందరి దేవతలను సులభము నెదిరే!
చఱచెను నింద్రుని పదవిని
దురహంకారమునతో యెదుటపడి నపుడున్.
మొరపెట్టెను దేవేంద్రుడ
సురక్కఱములు తొలగించి సుఖములకొరకై,
కరుణించు మమ్ము యనుచు నె
ల్లరు ప్రార్ధించుచు త్రిమూర్తుల శరణుకోరెన్
తేజము క్రోధమయి, శివుని
తేజము ముఖమైన, విష్ణు తేజము భుజమై
తేజపు బ్రహ్మ పదములై
తేజోవంతముగ వెలిసె దేవీ దుర్గై
ఆయుధములు సిద్ధపఱచి
చేయూతగ సింహమిచ్చి సేవించితిరిన్
ఆయమ్మ భీకర రణము
చేయగ సంపి విజయమును చేకూర్చెనుగా
తొమ్మిది దినముల పోరది,
తొమ్మిది యవతరణములగు దుర్గమ్మనుచున్
తొమ్మిది రాత్రుల పూజలు
యమ్మను గొలుచు దసరాగ యలరించునురా
*************************************************
అమరము = చావు లేకపోవుట; బ్రహ్మ =కమలజుడు, అజితుడు; సుమతి = కోరిక;అసువులకు=ప్రాణులకు; చఱచు = ఆక్రమించు; అక్కఱ = కష్టము