Posts

Showing posts from January, 2025

గురువులు - మనబడి

ఈ రోజు మన గురువుల ధ్యేయానిరతిని చూస్తూ ...  ఆటవెలదులలో ..  చె ప్పదలచినాను చి న్నమాట నయన ఎంత గొప్ప గురువు లంద రికడ బా లలందు తాము  బం ధమ్ము ముడివడి చెంత జేరవచ్చె నంత కలసి (1)    తల్లి దండ్రులంత అల్ల గురువులంత తెలు గుతల్లి యందు పలు కులిడుచు బా ధ్యతాయుతమ్ము పం చుకున్న తలపు అం దిపుచ్చుకున్న ఆ త్మబలము (2)   నే ర్చుకొనుట కన్న నే ర్పుట కష్టమ్ము బా లలందు నోర్పు బ హుళ గాద సం కటములు దాటి సం స్కృతిని నిలిపి సం స్కరించు మీకు వం దనాలు (3)

కొత్త వత్సరమని

పొద్దు పొడిసి నేడు నిద్దుర వీడుచు  కొత్త వత్సరమని కోరు టేల, మంచి తలపులన్ని మదిలోన పూయుచు కొత్త లోకములకు విత్తు వేయు (1)  నేను నాది యనక నెయ్యము చేకూర్చి  కొత్త బంధములను కూర్పుకొనుచు  మాటసాయమిచ్చి మానవత్వముతోడ   కొత్త లోకములకు విత్తు వేయు (2)