Posts

Showing posts from September, 2024

మనబడి - “ఈవారం నామాట”

 “ఈవారం నామాట” ************************ మన పిల్లలు మన మాతృభాష అయిన తెలుగు నేర్చుకోవాలంటే, ఆ భాష సౌందర్యాన్ని మనము ముందు తెలిసుకోవాలి. అయితే మన దైనందిత జీవితములో ఎన్నో మాటలు అలా వచ్చిపోతుంటాయి కాని మనము వెతికి చూసినంతవరకూ ఆ సౌదర్యభావన అవగతమవదు. సరే ఒక సారి మన బంధుత్వాలనుంచి మొదలు పెడదాము .. అమ్మ , నాన్న, అక్క , అన్న, తమ్ముడు, చెల్లి, అత్త, మావయ్య .. వీటన్నిటిలో ఉన్న ఆ అందమేముటో గుర్తు పట్టారా? 😀లేదంటే ఇంకొన్ని పదాలు చూద్దాము.. పిల్లజల్ల, పెద్దమొద్దు, ముద్దవద్దు, అట్టిపెట్టు .. ఏమిటో ఈయన ఏమి చెబుతున్నారు అనుకుంటున్నారా.. అవును వీటన్నిటికీ సామరస్యము ఒక హల్లు మీద అదే హల్లు పడేలా ఈ భాషలో ఉన్న అందం .. మీరు ప్రయత్నించి చూడండి .. మిగతా భాషల్లో ఎలాఉందో తెలియదు గాని దీనివల్లనే అనుకుంటా మన మాటలో ఒక తెలియని గానమాధుర్యాన్ని వినగలుగుతున్నాము. మరి దీనినే ద్విత్వము అంటాము , ద్వి అంటే రెండు, రెండు సార్లు ఒకే హల్లు కలయిక.. ద్విత్వ+అక్షరము = ద్విత్వాక్షరము .. ప్రసూనము తరగతిలో రెండవ పాఠములో మన పిల్లలు నేర్చుకుంటన్నవి ఇవేనండోయ్.. ఒప్పుకుంటారా ! 😀 అందుకే అన్నారు “దేశభాషలందు తెలుగు లెస్స” అని రాయల వారు...

గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు 2024

************ నాగర (నాగరక)********** ఓ గురువౌచు ధ్యానమున్ ఓ గురుతౌచు జీవమున్  ఓ గురువందు ప్రాణమున్  తా గురువుంచు నెల్లడున్! (1)    *గురువుంచు = గౌరవముంచు  గద్యములందు గమ్యమున్ పద్యములందు భావమున్  విద్యలనెల్ల నేర్పుచున్ ఉద్యమకారుడౌనుగా! (2) ఓర్పును గూడ బెట్టుచున్ నేర్పును సానబెట్టుచున్ కూర్పును కోరుచుండుచున్ చేర్పును జెంతజేర్చురా! (3) అంతటి గొప్పవారికిన్ చెంతన జేరినున్నచో ఎంతటి భాగ్యమౌను, మీ   కంతట, వందనమ్ములున్! (4)                               --- మల్లేశ్వరరావు పొలిమేర  ************************************************** నాగర పద్య లక్షణములు ఈ పద్య ఛందస్సుకే  నాగరక  అనే ఇతర నామము కూడా కలదు. వృత్తం  రకానికి చెందినది అనుష్టుప్పు  ఛందమునకు చెందిన  87  వ వృత్తము. 8  అక్షరములు ఉండును. 12  మాత్రలు ఉండును. మాత్రా శ్రేణి :  U   I   I  -  U   I   U  -  I   U 4  పాదములు ఉండును. ప్రాస నియ...