ఏమి వింతయో - ఉత్పలమాలలు
ఏమి వింతయో - ఉత్పలమాలలు 2019 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” లో ఈ క్రింది నా కవిత రెండవ ఉత్తమ కవిత గా ఎంపిక కాబడ్డాయి. ******************************** ఏమది తట్టి లేపునది? యిట్లు నుషోదయ క్రాంతి పుంజమున్ ప్రేమలుఁ బంచు బంధములఁ బేరుకుపోయిన భావ జాలముల్ నీమములన్ని నిత్యమయి నేర్పుగఁ నుత్పలమాల నల్లగా! నామది నెల్ల పద్యముల నానుడి, హాయగు గాక నేమదౌ! (1) కన్నుల రెప్పలాడుచునుఁ గమ్మని కైతలకేగి చూడగా చిన్నగ వచ్చి దివ్యమగు జీవన యానపు జ్ఞప్తిఁ జూపుచున్ మన్నన బొందు మానవుల మంచిని మాటల యందుఁ గూర్చుచున్ మిన్నగ సారవంతముగ మీటిన జన్మము ధన్యమౌనుగా (2) అంతట లేచి పానుపున నాశలు భాషలు నెక్కు పెట్టుచున్ చింతలు వీడి చేరువగు శ్రేష్ఠపు బుద్ధిని సాధనమ్ముతో అంతరమందు దైవమును నార్తిగఁ గొ...