Posts

Showing posts from November, 2024

తాతయ్యగారి 85 వ పుట్టినరోజు

Image
 తాతను పట్టుకు తారాడే నే  చేతిని వీడక చేదోడై నే పోతిని వెంటన బుట్టంగా నే, తాతను  ప్రేమము దాచేదేనా! (1)  పిల్లలు బెంచుచు ప్రేమించే తా నుల్లము నందున నుయ్యాలూపే ఎల్లలు దాటిన నీరోజేమో అల్లది భారమ నాలోచించే!  (2)       సాధ్యత నేమది  సందేహమ్మా!  భాద్యత జూపుచు భారమ్మైనన్ ఆద్యుఁడుతానయి ఆశాజ్యోతిన్ విద్యలు నేర్పుచు ప్రేరేపించెన్ (3) కష్టములన్నవి కావేరోజూ ఇష్టము చేయుచు నేర్వంగా యీ సృష్టికి బాటలు సేద్యంతో నీ దృష్టిని మల్చుము తృష్ణేదైనా  (4) యుక్తిని బెంచుచు యుద్ధాలెన్నో శక్తికి మించిన సాధించొచ్చోయ్ భక్తిని నేర్చిన బాధ్యత్వమ్మున్ ముక్తిని మీటెద ముందస్తుండై    (5) పేదరికమ్మును పీల్చేగాలిన్ బాధలనన్నియు బంధించంగా     వేదనగమ్ముచు వీచేగాలిన్ శోధనలెట్లని  సూచించంగా  (6)  ఆ హనుమంతుని పాఠాలెన్నో  ఊహనునుంచుచు శోధించంగా సాహస జీవత సాఫల్యమ్ముల్ దోహదమైనవి దూరాలోచన్  (7) రానిది యేమని ప్రారంభిస్తే కానిది యేమని కాస్తోకూస్తో మానక నేర్వని మాటందిస్తే   కానద గెల్పును కార్యార్థమ్మున్ (8) ********...