తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు -2025
ఒ కమాట చెప్పుటకు ఓ ర్పుతోడ నే నొ క పద్యమెందుకని చూ చుచుండగా ఇ క భాషగా తెలుగు ఇం పులెన్నియో స కలమ్ము చూపెదని చా టుకొందునే (1) అ దికాద ఆంధ్రులకు అం దమిచ్చుచూ ప దిమంది గౌరవము పం చునెప్పుడూ, మ దిదోచు మాటలను మం చికోరుచూ క దిలించునే తెలుగు గా థలెన్నియో (2) అ టుచూడు పామరులు పా డుచుండిరే ఇ టుచూడు పండితులు వి ద్య జూపగా చి టుకేసి చాటువులు చె ప్పుచుండిరే కి టుకేమిరా? తెనుగు కీ ర్తి జూపగా (3) అ లవోకగా చిలుకు హా స్యమెంతయో ప లికించిరే గిడుగు బా టవేయుచూ ఉ లికించిరే తెలుగు బో ధనమ్ములో వి లువైన సంపదని పే రు నిల్పెరా (4) మల్లేశ్వరరావు పొలిమేర ట్రోఫీ క్లబ్ , డల్లాస్ 08.29.2025 కనకప్రభ పద్య లక్షణములు ఈ పద్య ఛందస్సుకే మంజుభాషిణి , జయా , నందినీ , ప్రబోధితా , మనోవతీ , విలంబితా , సునందినీ , సుమంగలీ అనే ఇతర నామములు కూడా కలవు. వృత్తం రకానికి చెందినది అతిజగతి ఛందమునకు చెందిన 2796 వ వృత్తము. 13 అక్షరములు ఉండును. 18 మాత్రలు ఉండును. మాత్రా శ్రేణి : I ...