Posts

Showing posts from 2020

పూర్వి పుట్టిన రోజు

 గానముతోడు తోచు తను గాత్రపు మాలలు మాకు విందులౌ   ఆనతిగాన వేకువను హాస్యముతో మదిలో కుదించుచున్  కూన తలంపు లందెలను కూర్చుచు ప్రేమములన్ని  ప్రాసలౌ  కానన మా గృహమ్ము పతకమ్మున పుత్తడి బొమ్మ ఆయగా   (1) చిన్నగ చిందులేయుచును చేతను కొయ్య పు బొమ్మలందు వీ  లున్న  విధమ్ము లాడుచును లోగిలి కందము పూయుటందుకా  కన్నటి తల్లిదండ్రులకు కారణ భాగ్యము దీర్చి ఆకశ మ్మున్నటి  తారవై వెలిగి ముచ్చటి గొల్పును  పూర్వి మోదమున్ (2) ******************************************************************** ప్రతీ నూతన సంవత్సరము తోడుగా  మా యింటి పండుగై  మా యింటి మహాలక్ష్మియై  చిట్టడగులు అందెల సవ్వడి కూర్చుటకై  వచ్చెరా  మా బంగారు తల్లి  ఆటలలో  అలజడి కూర్చి  మాటలలో మంత్రములు కూర్చి  పాటలలో ప్రాయము కూర్చి  తేట తేట పలుకులు  నేటి మాట వెలుగులు కూర్చి  వచ్చెరా   మా బంగారు తల్లి    మొదటి సంవత్సరపు   ముచ్చటి గొలిపి  రెండవ సంవత్సరపు  నిండుతనము చిలికి...

Happy Christmas 2020

Image
  Happy Christmas **************************************** HO HO HO HO All kids are around the tree Fun with all the snow Santa surprises are here, you see (1) I know KINKU here Come near to me sweetheart What do you want for Christmas dear? I wish you will get a new cart (2) Stockings are full of gifts Jingle bells, here and there PURVI dances having shifts Christmas carols everywhere (3) What a planned eve DHRUV Milk and crackers are for Santa! What a thrilling moment for kids to prove And Make it happy with Mama’s infanta (4) **************************************** Malleswara Rao Polimera 12.25.2020

చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు

 చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు ************** నాకు తోడౌ బంధము  నన్నంటు బంధము అన్న అన్న యని నా వెంటుండు బంధము  మనసు మమత  మంచి చెడ్డ  మా చిన్ననాటి సంగతులు  పంచుకున్న కాకి యంగిలి జంతుకులు పండుగల కోలాహలం నిండుకున్న ఆనందాలు  అండదండలుగ అన్నతో సహవాసము అమ్మానాన్నల జ్ఞాపకాలు అమ్మమ్మ తాతయ్య ఆలాపనలు ఊసులాడుకొని ఊయ్యాలాటలు పయనమవుతు బడికి  గౌరమ్మ గుడికి కొత్తబట్టల కోలాహలము చిలికి ముసిముసి నవ్వులు యొలికి సమీక్షలలో కాలక్షేపము పరీక్షలకై తర్జనభర్జనలు శిక్షణలో తాతయ్య బోధనలు నిరీక్షణతో మార్కుల లెక్కలు తొక్కుడుబిల్లల ఆటలో యురుకు వీరివీరి గుమ్మడిపండులో చురుకు చింతపిక్కల ఆటలో తలుకు వైకుంటపాళిలో మెలుకు  ఆటలలో కలసి మాటలలో తలచి చేతలలో వలచి మనసులో నిలచి ముంగిట ముగ్గుల తోరణాలు  రంగులతో నద్దిన పండుగలు  అమ్మమ్మకు తోడుగు నుండి  చెంగుమను తిరుగాడు సందడి  మా ఇంటి వనితవై ఓ ఇంటి ఇల్లాలివై మంచికి మారుపేరుగ  పంచిన ప్రేమగీతములు తోడబుట్టిన నా చెల్లి చూడచక్కని నా తల్లి ఏడఉన్నను నా చెల్లి వేడుకౌదునుగా మల్లి ..... పుట్టినరోజు శుభాకాంక్షలు  *****...

To Dhruv Tatayya

 ****************************** Nothing will stop tears when loved one touching heart  Getting a letter from dears Is an unforgettable moment not to fall-apart (1) Fun-filled Grand Pa  to have with heartful love and affection   Dhruv is very lucky to have such a wonderful personal action (2) Thank You for your Birthday Note Dhruv always reminds you more Thank You for your Wish Note  Dhruv always loves you more  (3) ***************************

అమ్మాయి పుట్టుక - వెంకీ పాప

***********************************************  అమ్మాయి పుట్టుక అందాల తోరణం  కమ్మగా మాయింట కళకళ తోరణం  చెమ్మగిల్లిన కళ్ళల్లో ఆనంద తోరణం  అమ్మ నాన్నల ఆశల హరివిల్లు తోరణం  పిల్ల వచ్చెనోయ్  పిల్లా వారింట  వెల్లు వెక్కెనోయ్  వెంకీ స్వాతింట  అమ్మమ్మ తాతయ్య  నాన్నమ్మ తాతయ్య  అత్త మామామల నోట,  అన్న అచ్చట ముచ్చట , బావ వదినల  బుల్లి గడుగ్గాయల నోట,  ఒకటే సందడి  పండుగలో పందిరి పలుకలో చెల్లెమ్మ  కులుకలో చెల్లెమ్మ  తళుకులో తారమ్మ  చిలుకు బోసినవ్వమ్మా  రావమ్మా లక్ష్మియై  తేవమ్మా సంతసం  పుడమిపై పూర్ణమ్మ  పుత్తడి బొమ్మ నీవమ్మా  కోటి ఆశల తీరమ్మై  పుట్టినింటి ప్రేమగీతమ్ములు  మెట్టినింటిలో సారమ్మై  అట్టిపెట్టు ప్రేమగీతమ్ములు  నీ రాక మార్పులే  మాకెన్నో చేర్పులై  నీ తీపి గుర్తులే  మా ఇంట కూర్పులౌ  నిండు నూరేళ్లు  పండువెన్నెల పూసి  మెండు జీవితమందు  ఉండు నా తల్లి  పుడమి నందు .... అందుకో మా శుభాశీసులు  *************************...

పారిజాతాపహరణం - పద్యము (ప్రభాసము)

 మనము(within Heart)నన్  అనుమానమున్(even with doubt)  ఊనను(not say)  నీ(your)  నామము(Name)+అనుము (say)+అనుమననము(repeatedly chanting)ను నేమమ్ము(as a rule)న మానన్(don't give up),  నన్ను (Me)  మన్నన(with kindness) మనుము(live long)+అను(say), నానా(Many) మునీన(saints) మాన(expectations)+అనూనా(not reachable one!)  

Halloween time

Image
  Halloween time Early days of winter time Season for beans Reason for kids counting scenes... Fun of findings Fun of windings Creepy creepers Happy remembrance...

Happy Diwali

  Traveling from India Towards North America There is no limit to lighten up Every part of world, what’s up A month before Christmas Lightning the hearts To get rid of the dark From all sides to embark Sequence of Diyas Equipped with family and friends Spreading the smiles Sharing the sweets Filling with fun of crackers Echoing with wonderful sparkles Happy Diwali A Lightening holy ..... Malleswara Rao Polimera 11.14.2020

Tomoto Dil

Image
  My backyard Tomoto plant speaks : (Tomoto Dil) **************************************** All times, I grow myself hard To give delicious crop and safeguard Now I started late with my cutie pies What a green kiddos like green peas About to welcome winter All plants are thinking it is a hunter Can I survive some more days Can I ripen my sweeties on their ways I am worrying, fellow dear plants I know the same answer you also want My boss didn’t give me a greenhouse He is trying to provide a house Requesting his garden group Do we need to wait or make a soup? **************************************** .... Malleswara Rao Polimera 11.13.2020

నవరాత్రులివై

 ******************* వసుధ  ******************** ఇలశక్తివిగా పలురూపములో   కొలువుండుచు నీ వెలుగొందెనుగా  (1) తొలి పార్వతిగా మలు లక్మివిగా అల భారతిగా వెలుగొందెనుగా (2) నవరాత్రులివై కవనమ్ములివై  పవనమ్ములిలా  ప్రవహించెనిలా (3) నినుకొల్చుటకై  కనుచూపులలో  మనసంతటలో మునుఁగుండెదగా (4)  భువిరాక్షసమౌ కొవిడందుపడెన్  నవలోకములో  నవరోగములే  (5)  ఒడుదుడ్కులతో  పడుపౌరులకై  ఇడు శక్తినిలన్ కడు వెల్గులతో (6)  *************************************** వసుధ (కిసలయ , తిలకా) పద్య లక్షణములు ఈ పద్య ఛందస్సుకే  కిసలయ , తిలకా  అనే ఇతర నామములు కూడా కలవు. వృత్తం  రకానికి చెందినది గాయత్రి  ఛందమునకు చెందిన  28  వ వృత్తము. 6  అక్షరములు ఉండును. 8  మాత్రలు ఉండును. మాత్రా శ్రేణి :  I   I   U  -  I   I   U 4   పాదములు ఉండును. ప్రాస నియమం  కలదు ప్రతి పాదమునందు  స , స  గణములుండును.

74 వ స్వతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

భరతమాత ఒడిలో భాగ్యవంతులం  భరతజాతి పలుకు పంచి చూపుదాం   (ప)  మాతృభూమి గాలి మాతోడు మానీడ            మాతృభూమి నీరు మాయందు ప్రవహించు   మాతృభూమి మాట మామంచి సంస్కృతిన్            మాతృభూమి పేరు మాతోటి నడయాడు   మాతృభూమి వెలుగు మలచి చూపుదాం (చ 1)  స్వాతంత్ర దినమును స్వాగతించి నేడు            ఆమువ్వన్నెల జెండా ఆశలో భాగమై  అమరవీరులందరిని ఆత్మలో నిలిపి            అరాచకత్వమ్ము అణిచివేయదలచి  మాతృభూమి వెలుగు మలచి చూపుదాం (చ 2)  సారవంతపు నేల, సముద్రకాంతలు గల్గి             సంప్రదాయము, సాంకేతికలు నిండి  సాహిత్య సంపద, సహజసిద్ధ వనరులతో              సర్వమత సమ్మేళనములు జూపు మాతృభూమి వెలుగు మలచి చూపుదాం (చ 3)          

జన్మాష్టమి శుభాకాంక్షలు

************* కలరవము *************************** వసుదేవుని గృహమున బుడతవురా   అసి దేవకి హృదయపు శిశువవుచున్  నిశిరాత్రి యమున నది పయనముతో దిశ నందుని గృహమున కొలువయెరా (1)    అనురాగపు యడుగులు వలపగ రా మనసంత మురిపములు నిలుపగ రా  తనువంత ప్రియమవుచు తలపగ రా కనులార కలవరము కలుపగ రా  (2) ***************************************************** కలరవము పద్య లక్షణములు వృత్తం  రకానికి చెందినది శక్వరి  ఛందమునకు చెందిన  8188  వ వృత్తము. 14  అక్షరములు ఉండును. 16  మాత్రలు ఉండును. మాత్రా శ్రేణి :  I   I   U  -  I   I   I  -  I   I   I  -  I   I   I  -  I   U 4   పాదములు ఉండును. ప్రాస నియమం  కలదు ప్రతి పాదమునందు  స , న , న , న , వ(లగ)  గణములుండును.

రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు

అవనిలో అమ్మకు ప్రతిరూపము అక్క చెరిగిపోని ప్రేమకు ప్రతిరూపము చెల్లి  తోబుట్టువులౌ తొలుత స్త్రీమూర్తులు  మనపుట్టుకకు మరో అనురాగమూర్తులు  మన మనసుకు దగ్గరి బంధువు  మన మమతలు పంచిన బంధువు మన బాల్యపు స్నేహపూర్వక బంధువు  మన సరదాల సహిత వలపుల బంధువు  బాధ్యత నెరిగిన బంధము లెన్నో  బాధలు పంచుకొను నిస్వార్ధము లెన్నో  భారము కాదను భావనాలెన్నో  బాటను పంచెడి భాగ్యము లెన్నో  మాఇంటి మహాలక్ష్మియై  మెట్టినింటి గృహాలక్ష్మియై  తనయింటి ప్రేమానురాగాలు పలికించె సప్తస్వరాలు   మల్లేశ్వరరావు పొలిమేర  08.03.2020

పల్లెల పాడిపంటలనుఁ

Image
పల్లెల పాడిపంటలనుఁ బామరులెల్లరు సాగుచుండగా అల్లది పట్టణమ్ములను హద్దులు లేవని సాగు చూడరా, ఎల్లరు పొట్టకూడికని  నెంచిన నౌకిరి కేగుచుండగా ఉల్లమునెన్నొ యూహలిటు నోర్పుగ నుత్పలమాలలూగెనో …   "మానవ జాతి మన్నుగడ మాదని" కర్షకలోక మందులో నా నవజాతి కష్టముకు నన్నపు గింజలు కూడ బెట్టగా కానక కాలగర్భమున కార్యములందున వెట్టి చాకిరిన్ లోనగు పట్టణస్థులును లోకము తీరును చూడకుండిరే …    పచ్చని పంటభూములను పల్లెల బాగుకు నెక్కుపెట్టుచున్ మెచ్చెడి క్రొత్తపద్ధతులు మీటుచు నాగరికమ్ము నిల్పుచున్ స్వచ్చత నింట నిల్పుకొని సంస్కృతి నిండిన రాజ్య సంపదై    వచ్చిన మార్పుమంచికని స్వాగతమిచ్చుచు సాగిపొమ్మురా  …   శృంగములన్ని శోభయగు వృద్ధిని కోరుచు సామరస్యమున్ రంగములందు పాలకులు రాజ్యపు రాసులు రంగరించగా భంగముగాక లోకులకు పల్లెలు, పట్టణముల్ సరాసరై హంగులనెన్నొ నింపుకుని  నందరి సౌఖ్యములెత్తి జూపురా …   శృంగములు = ప్రభుత్వాలు

Happy Fathers Day ....

  ***************************** Every day in our life Never say any word Every minute for our life Never stop working hard (1) Every day what he feel Never show in his face Every minute by accumulate love Never ever over flow (2) Every day any pain Never show in his tear Every minute bear the strain Never clear what he wear (3) Every day with my mom Never boost himself bold Every minute with the family Never recognize to the world (4) What a person he is? Do you think he is MAD? What a love it is? Do you think it is BAD? (5) What a feeling he has? Do you think it is SAD? Who is he finally? Yes yes, he is the DAD... (6) Happy Fathers Day .... 06.21.2020 Malleswara Rao Polimera *****************************

అల్లంకు వారికి వందనముల్

**************** మధుమతి ( స్వనకరీ )************** మనసు మాటలతో   తనువు చేతలతో   కనుల చూపులతో   అనుచు వ్రాయుదునే (1) కలము కాగితమున్ మలచి మంత్రములన్ తలచి పద్యములన్ వలచి వ్రాయుదునే   (2) మెరుగు మానసముల్   తరుగు తాపములున్   కరుగు ప్రాణములున్   తరిగి వ్రాయుదునే (3) చదువు పుస్తకముల్   ఒదుగు నొజ్జలలా కుదురు కల్గెదరే , విధిగ   వ్రాయుదునే   (4) ఒక “ శరత్తు ” న , మీ   రొక “ ప్రియ ” మ్మవుచున్ ఒకరి కొక్కరు చే   రికయి , బంధువులౌ (5) కలసి స్నేహితులై   కలసి బంధువులై   కలసి వేడుకులన్   కలసి నింపెదరున్   (6) కలసి  " నేహ"ను ధ్రువ్   వలచి పూర్వి  " క్రిష"న్   అలుపు రావనుచున్ కలసి పోయెదరే   (7) కలసి ఆటలతో కలసి మాటలతో   కలసి వచ్చెరు , నే కలగ వ్రాయుదునే   (8) కలము చూడగనే   విలువ చూడగనే   కలువ రేకులలా   మలచి వ్రాయుదునే (9) తెలిపి వందనముల్   క...

నలభై వసంతాల పయణం

నలభై వసంతాల పయణం నలుమూలలా పంచి చూపిన ప్రణయం  నమ్మకంతో తోడుండు హృదయం  నాలుగు అమావాస్యలు దాటగలిగే వినయం  పున్నమి పౌర్ణమి వెలుగులతో  కన్నకలల సాకారముతో  మిన్నటి జీవితగమనముతో  విన్నవించును మీ పుస్తక పఠనము  లీలలు కలగలుపు అర్ధాంగి  వీలుగ మలచగలుగు నాథుడు  ఏలిన సంసార సాగరము  ఆలనలో మీ సహగమనము  ఆటుపోటుల నెదురించి  చేటును దూరము నుంచి  వాటాలకై ఆశించక  తూటాలనే సంధించి  కట్టుకున్న ఆ సుందర గృహము  మట్టుకు మహా అంబురుహము తట్టిన సరదాల సందర్శన ఎట్టివారికైనా ఆదర్శణ  అందుకోండి అభినందనలు  ముందు తరాల వందనములు  పొందులే కలగలుపి అందరి శుభాభినందనలు ఆలన = ఆలకించుట అంబురుహము = పద్మము, నీతిలో పుట్టునది ఇట్లు  మాధవి - మల్లేశ్వర  వెంకటేష్ - స్వాతి  చెర్రీ - పూర్వి  కింకు  05/07/2020 మల్లేశ్వరరావు పొలిమేర 

మారిన లోకపు

మారిన లోకపు మంటల్లోనన్ కూరిన మానవ కోరల్లోనన్ చేరిన దీనటి జీవమ్ముల్లో పేరుకు పోయెను భీతుల్, రాతల్ (1) ప్రేమలు పంచిన పెండ్లాముల్లున్ ప్రేమలు పంచిన ప్రేయాంసుండుల్ ఓమటి నిచ్చెడు నుద్యోగాలన్ రామని యింటికి రాజేసుండ్రున్ (2)     

మా పెళ్లి రోజు - మా కందములు - మాకు అందములు

*********మా పెళ్లి రోజు - మా కందములు - మాకు+అందములు *********** ఒట్టులు పెట్టుచు బాసలు మట్టుకు కలబోసె జంట  మాధవి మల్లేష్ మొట్టమొదటి వత్సరమున తట్టు తలపులు, మనసులను దగ్గరి జేర్చెన్ (1) - 2007 మట్టుకు = పొందికకు , ప్రేమకు "అండగ నేనుండెద నీ నిండుగ నేనుండెదననె" నెచ్చెలి వౌచున్ రెండవ వత్సర మందున మెండుగ మది పంచుకొనెను మిక్కిలి ప్రేమల్ (2) - 2008 ముచ్చటగా మూడవ సమ , పచ్చని కాపురముఁ గలిగె బాబుగ చెర్రీ వెచ్చని ప్రేమలు వెలుగుచు నిచ్చెను శోభలను పుత్రు నిచ్చనుఁ గూర్చీ (3) - 2009 సమ = వత్సరము , ఇచ్చ = చిత్తం, మనస్సు కొలువులని విదేశములన్ నలుదిక్కులు తిరిగి తరిగె నాల్గవ యేడున్  విలువయిన బంధము లవై మలుపును కోరుకొని వచ్చె మంచిగ తలపుల్ (4) - 2010 బుడిబుడి నడకల ధ్రువుతో వడివడి రోజులు కదులుచు వలపుల వలలో చెడుగుడు యాటలు కలిపెన్ అడుగులు నలవోక గింట  నైదవ శకమున్ (5) - 2011 చేరుకొనె నమెరికా నా ఆరవ సంవత్సరమ్ము నాశల తోడన్ దూరము బెర్గిన బంధపు ద్వారము ధృఢమౌ వలపులు స్వాగత మిచ్చెన్  (6)  - 2012 సరికొత్త జీవితమ్మిటు విరచితమై మా మది చదివెను "...

మధురగతి రగడ

**********************మానవ జాతికి ****************** మానవ జాతికి మారిన రోజులు ప్రాణముఁ దీయుచు భయమిడి రోజులు కానని కరోనఁ గాల్చిన రోజులు మా నవ జాతికి మభ్యపు రోజులు (1) పరిణతిఁ జెందిన ప్రాణివి గదరా పరులను జయించు బలుపువి గదరా కరుణను మరచిన కామివి గదరా దొరకని జబ్బుకి దొరికెను గదరా (2) ఉరుకులు పరుగులు ను త్తివి కాదా మరిచిన బంధము మండునుఁ గాదా విరుగుడు విద్యలు వింతలుఁ గాదా అరయఁగ మార్పును కోరెను గాదా (3) ఆశలు భాషలు అడియాసౌనా వేషము మార్చుట వీలగునౌనా రోషము వీడిన రోదసియౌనా దోషము లేనటి దొరలాగౌనా (4) **************************************** మధురగతి రగడ పద్య లక్షణములు జాతి(రగడలు) రకానికి చెందినది 8 నుండి 16 అక్షరములు ఉండును. 4 పాదములు ఉండును. ప్రాస నియమం కలదు అంత్య ప్రాస నియమం కలదు ప్రాస యతి నియమం కలదు ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము ప్రతి పాదమునందు నాలుగు 4 మాత్రలు గణములుండును.