Posts

Showing posts from June, 2017

సర్కారు బళ్ళు - చదువుల గుళ్ళు

సర్కారు బళ్ళు - చదువుల గుళ్ళు క.వి. చ దు వుల గుళ్లయి, సం స్కరణమ్ములు సా ధన చేసిన శా లలు నా ప ద లను చెర్చుచు బా ధ్యత నేర్పెడు వా రధులౌ, మన బ ళ్లు గదా! వ ద లక పేదల పా లిట పెన్నిధి వం టివనిన్, సమ భా వమునన్ హృ ద యము నెంచుచు శృం గము లెన్నడు వృ ద్ధిని బెంచిన హృ ద్యమగున్! (1) ****************************** కవిరాజవిరాజితము (హంసగతి , మహాతరుణీదయిత , శ్రవణాభరణమ్): 23 అక్షరములు ఉండును. 30 మాత్రలు ఉండును. మాత్రా శ్రేణి: I I I - I U I - I U I - I U I - I U I - I U I - I U I - I U 4 పాదములు ఉండును. ప్రాస నియమం కలదు ప్రతి పాదమునందు 8,14,20 వ అక్షరములు యతి స్థానములు ప్రతి పాదమునందు న , జ , జ , జ , జ , జ , జ , వ(లగ) గణములుండును. ************************************* సీ. తా తదండ్రులకు వి ద్య ను నేర్పిన బడులు త రతరాల చరిత్ర దా గు ...

తొలకరి చినుకులు - రైతుల తలపులు

తొలకరి చినుకులు పడక ఉ. ప ల్లె లు బంటభూములను బ ల్కుట మానుచు జిన్నబుచ్చుచున్ ఎ ల్ల లు దాటి, పట్టణము లె క్కువ ముంచుతు విఱ్ఱవీగుతున్ ఎ ల్ల రుకున్ విషాదముల ని చ్చుచు ముంచెను శోకసంద్రమున్ క ల్ల లు మానవయ్య, మము గా చగ రా! వరుణా! పరంజయా ! (1) ఇంద్రవజ్రము … మే ఘ మ్ము రాకుండెను మే దినందున్ తా గే టి నీరెక్కడ తా కకుండెన్ మా గా థ మా బాధలు మా ర్చలేకన్ త్యా గా ల జీవమ్ములు ధా రపోసెన్ (2) ****************************** ఇంద్రవజ్రము: వృత్తం రకానికి చెందినది 11 అక్షరములు ఉండును. 18 మాత్రలు ఉండును. మాత్రా శ్రేణి: U U I - U U I - I U I - U U 4 పాదములు ఉండును. ప్రాస నియమం కలదు ప్రతి పాదమునందు 8 వ అక్షరము యతి స్థానము ప్రతి పాదమునందు త , త , జ , గా(గగ) గణములుండును. ************************************* సీ. పై రు విత్తు నపుడు వ ర్షమ్ము రాకుండ నీ రుకై రోదించు ని త్యమతను నా రు నాలస్యమై నా భీలములు హెచ్చి య ధిగమించక వాలి య లసిసొలసె పం ట చేతికి రాగ వ ర్షించె పగబట్టి క ష్టమ్ము వ్యర్ధమై క లతపడెను ఋ తుపవనమ్ములు కృ తకర్మ తోడుత క లిసి రాకున్నచో క లిమి చెడును తే.గీ. ప ర్యవేక్షిం...

పెదమావయ్య, అత్తల పెళ్లి రోజు

Image
పెదమావయ్య, అత్తల పెళ్లి రోజు (వేంకట నారాయణ మరియు లక్ష్మి ) ***************** మత్తకోకిల ******************** ఎ త్తు కెత్తిరి తోడుగుండుచు నే మి తక్కువ జేయకన్ పె త్త నమ్మయి లక్ష్మి, వేంకట పే ర్మిజూపెను నిత్యమున్ హ త్తు కొల్పులు బంచునెప్పుడు హా యి బెంచెడు నెమ్మితో అ త్త మావల పెళ్లి రోజిది యా త్మనిండుగ వేడుకౌ పొ త్తు నింపుతు నెల్లకాలము బొం దునెప్పుడు సౌఖ్యముల్ ****************************************** పెత్తనమ్మయి = పెద్దయి, హత్తుకొలుపు = ఒద్దికపరచు, పొందు

ధనికొండ గారి సమస్య: నాశార్థము నాదు మనువు నాడు లభించెన్

వరుడు యొక్క కుత్సితబుద్దిని తెలుసుకొన్న వధువు పలుకులు ... ******************************************************* కం. వేశము మార్చిన యీ కీ నాశార్థము నాదు మనువు నాడు లభించెన్ నా శక్తిని నమ్మి "వలదు నీశుని" గని నే నెడలుచు నెలుఁగెత్తెనురా! ******************************************************* కీనాశ = రాక్షసుని , అర్థము = అభిప్రాయము, ఈశుని = భర్త

GITAM రోజులు

మా ఇంజినీరింగ్ GITAM రోజులు ... **************************************************** సీ. ఏ చోట గువ్వలో ఎగిరెగురుతు వాలె విద్యుత్తు శాఖలో విద్య కొరకు "గీతమ్"ను గలిసి సంగీత స్వరాలౌచు మిత్రులుగా ఆడి మైత్రి పెంచె సాగర తీరము, సంధ్యా సమయములు గడిపిన స్మృతులెప్డు కనులకింపు చిలిపి చేష్టలె నాడు, చిత్రములుగ నేడు చెలిమి పెంచేటివౌ స్నేహితులకు తే.గీ. జూనియర్లకై స్వాగత శోభలన్ని అరకులోయలకు విహార యాత్రకెల్లి పంచుకుంటిమిటు విశాఖపట్నమందు మూడు వత్సరముల నెమ్మి ముచ్చటాయె! ****************************************************