Posts

Showing posts from April, 2020

మా పెళ్లి రోజు - మా కందములు - మాకు అందములు

*********మా పెళ్లి రోజు - మా కందములు - మాకు+అందములు *********** ఒట్టులు పెట్టుచు బాసలు మట్టుకు కలబోసె జంట  మాధవి మల్లేష్ మొట్టమొదటి వత్సరమున తట్టు తలపులు, మనసులను దగ్గరి జేర్చెన్ (1) - 2007 మట్టుకు = పొందికకు , ప్రేమకు "అండగ నేనుండెద నీ నిండుగ నేనుండెదననె" నెచ్చెలి వౌచున్ రెండవ వత్సర మందున మెండుగ మది పంచుకొనెను మిక్కిలి ప్రేమల్ (2) - 2008 ముచ్చటగా మూడవ సమ , పచ్చని కాపురముఁ గలిగె బాబుగ చెర్రీ వెచ్చని ప్రేమలు వెలుగుచు నిచ్చెను శోభలను పుత్రు నిచ్చనుఁ గూర్చీ (3) - 2009 సమ = వత్సరము , ఇచ్చ = చిత్తం, మనస్సు కొలువులని విదేశములన్ నలుదిక్కులు తిరిగి తరిగె నాల్గవ యేడున్  విలువయిన బంధము లవై మలుపును కోరుకొని వచ్చె మంచిగ తలపుల్ (4) - 2010 బుడిబుడి నడకల ధ్రువుతో వడివడి రోజులు కదులుచు వలపుల వలలో చెడుగుడు యాటలు కలిపెన్ అడుగులు నలవోక గింట  నైదవ శకమున్ (5) - 2011 చేరుకొనె నమెరికా నా ఆరవ సంవత్సరమ్ము నాశల తోడన్ దూరము బెర్గిన బంధపు ద్వారము ధృఢమౌ వలపులు స్వాగత మిచ్చెన్  (6)  - 2012 సరికొత్త జీవితమ్మిటు విరచితమై మా మది చదివెను "...

మధురగతి రగడ

**********************మానవ జాతికి ****************** మానవ జాతికి మారిన రోజులు ప్రాణముఁ దీయుచు భయమిడి రోజులు కానని కరోనఁ గాల్చిన రోజులు మా నవ జాతికి మభ్యపు రోజులు (1) పరిణతిఁ జెందిన ప్రాణివి గదరా పరులను జయించు బలుపువి గదరా కరుణను మరచిన కామివి గదరా దొరకని జబ్బుకి దొరికెను గదరా (2) ఉరుకులు పరుగులు ను త్తివి కాదా మరిచిన బంధము మండునుఁ గాదా విరుగుడు విద్యలు వింతలుఁ గాదా అరయఁగ మార్పును కోరెను గాదా (3) ఆశలు భాషలు అడియాసౌనా వేషము మార్చుట వీలగునౌనా రోషము వీడిన రోదసియౌనా దోషము లేనటి దొరలాగౌనా (4) **************************************** మధురగతి రగడ పద్య లక్షణములు జాతి(రగడలు) రకానికి చెందినది 8 నుండి 16 అక్షరములు ఉండును. 4 పాదములు ఉండును. ప్రాస నియమం కలదు అంత్య ప్రాస నియమం కలదు ప్రాస యతి నియమం కలదు ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము ప్రతి పాదమునందు నాలుగు 4 మాత్రలు గణములుండును.

మనసులో మాట

04/10/2020 గౌరి శంకరులను కార్యమున్ తల్చుచున్ ఆ వినాయకునికి హారతిచ్చి విజ్ఞములకెదురగు విజ్ఞతన్ కోరుచున్ వీరతిలకమద్ది వేడుకొనెద  (1) 

నా బాల్య మందున్నటి

******************** ఇంద్రవంశము ********************** నా బాల్య మందున్నటి నాటిరోజులై   ఏ బాట   లేకుండుట యిట్టి రోజులై ఆబాలగోపాలము లాడు రోజులై   మాబాగు లోకమ్మయి మంచి రోజులౌ (1) ఆబాలగోపాలము = చిన్నలు మొదలు పెద్దల వఱకు మాబాగు = very well   లోకమ్ము నేలున్నను లోటు లేదురా శోకమ్ము లేకుండను చూడు సోదరా   నీ కళ్లముందుండునె నీ కుటుంబమై నీ కంటి ప్రేమౌనుగ నిన్ను దల్చుచున్ (2)   అందాల లోగిల్లను హత్తుకుండుచున్   బంధాల ముంగిల్లను పంచుచుండురా విందంటు ముందుండు నవే మమేకమై మందంటు ముందుండిన మంచి గుర్తులౌ (3)   నీ భోగభాగ్యమ్ములు నీకు నిచ్చునా ?   నీ భార్య నీ బిడ్డలు నీకు దగ్గరై   నీ భాగ్యవంతమ్మును నిగ్గుచుండుగా   నీ భారమంతా కననియ్యకుండుగా (4)   కష్టమ్ము లౌచున్నను కాంచు మంచినే   ఇష్టమ్ము లేకున్నటి ఈర్ష్య లేలరా స్పష్టమ్ము గా నిప్పుడు సాయమిచ్చుచున్   సృష్టించు నీజాతిని వృద్ధి చేయరా (5) ********************************...