Posts

Showing posts from May, 2020

అల్లంకు వారికి వందనముల్

**************** మధుమతి ( స్వనకరీ )************** మనసు మాటలతో   తనువు చేతలతో   కనుల చూపులతో   అనుచు వ్రాయుదునే (1) కలము కాగితమున్ మలచి మంత్రములన్ తలచి పద్యములన్ వలచి వ్రాయుదునే   (2) మెరుగు మానసముల్   తరుగు తాపములున్   కరుగు ప్రాణములున్   తరిగి వ్రాయుదునే (3) చదువు పుస్తకముల్   ఒదుగు నొజ్జలలా కుదురు కల్గెదరే , విధిగ   వ్రాయుదునే   (4) ఒక “ శరత్తు ” న , మీ   రొక “ ప్రియ ” మ్మవుచున్ ఒకరి కొక్కరు చే   రికయి , బంధువులౌ (5) కలసి స్నేహితులై   కలసి బంధువులై   కలసి వేడుకులన్   కలసి నింపెదరున్   (6) కలసి  " నేహ"ను ధ్రువ్   వలచి పూర్వి  " క్రిష"న్   అలుపు రావనుచున్ కలసి పోయెదరే   (7) కలసి ఆటలతో కలసి మాటలతో   కలసి వచ్చెరు , నే కలగ వ్రాయుదునే   (8) కలము చూడగనే   విలువ చూడగనే   కలువ రేకులలా   మలచి వ్రాయుదునే (9) తెలిపి వందనముల్   క...

నలభై వసంతాల పయణం

నలభై వసంతాల పయణం నలుమూలలా పంచి చూపిన ప్రణయం  నమ్మకంతో తోడుండు హృదయం  నాలుగు అమావాస్యలు దాటగలిగే వినయం  పున్నమి పౌర్ణమి వెలుగులతో  కన్నకలల సాకారముతో  మిన్నటి జీవితగమనముతో  విన్నవించును మీ పుస్తక పఠనము  లీలలు కలగలుపు అర్ధాంగి  వీలుగ మలచగలుగు నాథుడు  ఏలిన సంసార సాగరము  ఆలనలో మీ సహగమనము  ఆటుపోటుల నెదురించి  చేటును దూరము నుంచి  వాటాలకై ఆశించక  తూటాలనే సంధించి  కట్టుకున్న ఆ సుందర గృహము  మట్టుకు మహా అంబురుహము తట్టిన సరదాల సందర్శన ఎట్టివారికైనా ఆదర్శణ  అందుకోండి అభినందనలు  ముందు తరాల వందనములు  పొందులే కలగలుపి అందరి శుభాభినందనలు ఆలన = ఆలకించుట అంబురుహము = పద్మము, నీతిలో పుట్టునది ఇట్లు  మాధవి - మల్లేశ్వర  వెంకటేష్ - స్వాతి  చెర్రీ - పూర్వి  కింకు  05/07/2020 మల్లేశ్వరరావు పొలిమేర 

మారిన లోకపు

మారిన లోకపు మంటల్లోనన్ కూరిన మానవ కోరల్లోనన్ చేరిన దీనటి జీవమ్ముల్లో పేరుకు పోయెను భీతుల్, రాతల్ (1) ప్రేమలు పంచిన పెండ్లాముల్లున్ ప్రేమలు పంచిన ప్రేయాంసుండుల్ ఓమటి నిచ్చెడు నుద్యోగాలన్ రామని యింటికి రాజేసుండ్రున్ (2)