Posts

Showing posts from May, 2019

Sridhar - 2

JBL support 03794921 శ్రీధరునికి నా నివాళులు, ఏది ఏమైనా  "స్వాగత" మిచ్చుటయే మన విధి. *******************స్వాగతం **************************** న్యాయదేవతను న్యాయము కో రా ప్రాయమివ్వమని ప్రార్థన జేస్తూ చేయిచాచినను శ్రీధరునందున్ శ్రేయమైనదని జీవుని కోరెన్  (1) జీవనమ్మునకు చేరిన టెక్షాన్ సేవనిత్యమని చేరిన శాఖన్ భావజాలముల బంధము తోడన్ త్రోవ పంచుటకు తోడయి నాడే (2) మాటలందునను మంచిని జూపెన్  తోటి వారికిని తోడుగ నుంటూ ఆటలందు తను అందుచు బాలల్ మేటియౌచు తను మీటె మనమ్ముల్ (3)  విందు జీవితము బిడ్డల కిచ్చే పొందు లెన్నియునొ పోగుగ పోసే చిందు లెన్నియునొ చెంతన పోసే  అంది వార్తలిటు నంతనె వీడెన్ (4) వారమవ్వగనె వాలుతు శాఖన్ తీరుతెన్నులను తెల్పిన వాడై చేరువవ్వగల శ్రీధర పల్కుల్ వేరు చేయనటి విశ్వపు ఛాయల్ (5) వందనమ్ము లివి బంగరు బిడ్డా వందనమ్ము లివి ప్రజ్వల పుత్రా వందనమ్ములివి భాగ్యపు పుత్రా వందనమ్ములివి భారత బిడ్డా  (6) *********************************************** స్వాగతం పద్య లక్షణములు వృత్తం రకానికి చెందినది త్రిష్టుప్పు ఛందమునకు చెందిన 443...

Sridhar 1

నా మిత్రుడు తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ ... **********************************నాగర (నాగరక)***************************** మాటలు రాని రోజయే నేటికి నమ్మలేనుగా తోటి సహాయకుండు కా చేటగు సుస్తి చేసినన్ / కేన్సరొచ్చినన్   (1) శాఖను మేము మైత్రితో రేఖలు లేని నాప్తులౌ  ఆఖరు మాకు శోకమౌ లేఖిని, కార్చి బిందువుల్   (2) లేఖిని = కలము ఆడిన యాట లెన్నియో పాడిన పాట లెన్నియో తోడగు వారి వేళలన్ నేడును గుర్తు కొచ్చెరా  (3) శ్రీధర నీకు తోడుగా ఈ ధర యందు యుంటుమీ సాధన చేయు యత్నమున్ బాధక మేమి లేకయే  (4) ధర = నేల ఎందుకు జీవి తాలిలా ఎందరి వేద నౌనురా  అందని వైద్య విద్యలై అందరి యమ్మ వారయే (5) ఎంతటి వారి నైననూ పొంతన లేని శోకముల్ వింతలు కాంచి వేదనల్ మంతన మందు చింతలే (7) వేడెద గౌరి పార్వతిన్ వేడెద గౌరి శంకరున్ వేడెద నే వినాయకన్ వేడెద కోలుకొమ్మనిన్  (8)  *************************************************************** నాగర (నాగరక) ఈ పద్య ఛందస్సుకే నాగరక అనే ఇతర నామము కూడా కలదు. వృత్తం రకానికి చెందినది అనుష్టుప్పు ఛందమునకు చెందిన 8...