Posts

Showing posts from September, 2017

విజయదశమి శుభాకాంక్షలు

Image
విజయదశమి శుభాకాంక్షలు ***********************ద్విపదమాలిక **************************** అసురునిపై దేవ యని కృతయుగము వశపరచుకొనెడి వంకర బుద్ధి  త్రేతాయుగమ్ము దరిన్ చేర దలచె  సీత నపహరించి శ్రీలంక నందు ద్వాపర యుగ మన్న దమ్ములలోన నాపసోపాలతో నధికమించగను కలియుగమందు నీకంతర్గతమయి కలవరపరచుచూ కల్మష మిచ్చు మతములు జెప్పెడి మానవత్వమిడి సతమతమయి నేడు స్వార్ధమ్ము కోరి దుష్ట శక్తి నెదిరి దుర్బుద్ధి నెదిరి కష్టమ్ము రాకుండ కలిమి కోరుచును మానవుడె మనిషిన్ మనలో నొకడని మానము నిచ్చెడి మార్పు కొరకును దసరాను జరుపుచు ధ్యానించు భువిని దిశజూపి నెలకొల్పు దేశమున్ శాంతి. *************************************************** అని = యుద్ధము , మానము = గౌరవము

ప్రసూనం - ఇంటిపని

మొదటి పాఠము పిల్లలు ముచ్చటించి చదివి వినిపించిరి కథను  మధురముగను అక్షరములను కూర్చెడు దక్షత తమ చెంత నున్నదన్నారిటు సంతసించి ఇంటి పనిలోని పదములు నేమి టనుచు అడిగి తెలుసుకొనుచు వాటి యర్థములను నిశితముగ వివరించుచు  నేర్ప వలెను మనము నేర్చిన మధురపు మాతృభాష ఆకతాయి యని నిరవై ఆరు పుటను మొదలు, నిరువది యేడును వదల కుండ వ్రాయ మంటిని నింటిలో పలుకు చుంటు పర్యవేక్షణ చేయండి వందనములు    

వైద్యరంగం - మారుతున్న సమీకరణాలు

వైద్యరంగం - మారుతున్న సమీకరణాలు మానిని (మదిరా , లతాకుసుమ , సంగతా):: వైద్యులు నూరుకి వచ్చుచు, ముచ్చట బంచుచు జే సిన వైద్యములున్ విద్యను నమ్ముచు బేరము లాడక పేదల నారయు వేళలు పో చోద్యము జూపుచు సొమ్మును గోరుతు సోకులు బెంచుచు చూపులకున్ బాధ్యత నాదని ప్రాయము నిల్పెడు భావన రానటి బ్రధ్నములౌ (1) ఆరయు = ఆదుకొను, పో = పోయి ,   బ్రధ్నము = దినము ****************************************************************** వృత్తం రకానికి చెందినది 22 అక్షరములు ఉండును. 30 మాత్రలు ఉండును. మాత్రా శ్రేణి: U I I - U I I - U I I - U I I - U I I - U I I - U I I - U 4 పాదములు ఉండును. ప్రాస నియమం కలదు ప్రతి పాదమునందు 7,13,19 వ అక్షరములు యతి స్థానములు ప్రతి పాదమునందు భ , భ , భ , భ , భ , భ , భ , గ గణములుండును. *****************************...

గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు

గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు  *********************************************************************** మ.వి. తను స్వార్థమ్మును సంస్మరించకనె విద్యార్థిన్ సువిజ్ఞాతగా మన కందించుచు నిర్విరామమున తా మాధ్యస్థముండౌచు శ క్తిని యుక్తిన్ తగు పిల్లలందున ప్రసాదించంగ గర్వింతురే,  కని నాచార్య దినోత్సవమ్మున శుభాకాంక్షల్ ప్రదర్శించెదన్! ***********************************************************************

గుంటూరు సభ - ప్రజ పద్యం

****************************** కం. బాగున్నవి చిత్రమ్ములు, సాగిన గుంటూరు సభను సందడి తోడన్ రాగపు పద్యములన్నియు, పోగయి కవిమిత్రులంత ప్రోత్సాహించెన్! ******************************