Posts

Showing posts from May, 2023

ఐ.పి.యల్ ఫైనల్

Image
 సీ.  విజయమన్నది మన నిజజీవితపు కేళి నిన్నటి ఐ.పి.యల్ నెంచి జూసి  ఆడుటలోనుంది అద్వితీయ ప్రతిభ గెలుచుట, ఓడుట నిలుచుటకని  చివరి బంతి వరకు నెవరు పోరాడినన్ తృటిలోన జారిన తృప్తి పొందు అంచనాలకు మించి పొంచియుండు గెలుపు వదలవలదును చెందదని వీడి తే.గీ.  ఏమది? సి.ఎస్.కె ఎదురీత నేమి జూపె! ఏమది? జి.టి. పోరాట పటిమకు సాటి! చూడ ముచ్చట నాటయి వేడుకైన నేర్పుజూపించె యువతకు నేటి గెలుపు!        

ప్రకాశపు స్మృతములు

Image
సీ.  మనబడి ఇర్వింగు ఎనలేని స్మృతములన్ నా యందుఁ నుంచుచుఁ  శ్రేయ మయ్యె! "భువన" ఉచ్చారణ పోలికలో నిడు  తికమక తలపులన్  తేల్చ వలసి, "సాయి" మౌనాన్ని, ఏమాయ చేయుచు సమా ధానాన్ని రాబట్టు స్థాయి నెఱిఁగి, మాటకో ప్రశ్న నారాటము నాపక  సంధింపఁజేయుఁ  క్రిష్ సంశయాలు  తే.గీ.  కీర్తన చిరుతిండ్లయెడ సంకీర్తనాలు అటునిటున చార్వి, అనిరుథ్ల హాస్యకేళి  ఎదురనున్న హేమిష్ వ్యంగ్య వేషములయి  చూడ చక్క ప్రకాశపు స్కూలు మాది           

పెదపూడి మల్లికార్జున రావు గార్కి

Image
  తెలుగు నేర్పుటలోతను ధ్యేయమవుచు  తెలుగు పద్యములోతను నిలిచి పాడి   తెలుగు గద్యములో తను విడమరచుచు తెలుగు భాగ్యపు భావముల్ పలికి నారు ! (2)