Posts

Showing posts from 2023

భాషేదైనను - భాస్కర్ గారి ప్రశ్న

Image
శా. భాషేదైనను భావమంతయును తా ప్రజ్వల్లి శోభించుచున్  వేషమ్మున్ ప్రతిబింబమౌచు ధరణిన్ వేనోళ్ల వ్యాప్తిన్చుచున్ దోషంబుల్ కనిపింప, కైతలను హృద్యోత్సాహముందెంచి యా       భాషాభాషికలందు స్వచ్ఛతగు జీవమ్మున్ సదా పొందెరా!    కైతలను/ఛందమును

Secret Santa 2023

  ********************************** Secret Santa time is here  To bring you lots of joy and cheer! When I get your name in hand  Thinking of what should I choose?  A dish from your favorite restaurant? I’m afraid it won't last that long!  How about some  kind of  memories?   I know you capture others every time! PA SS by a scented candle... AMM ..  VA SE also looks so nice… W ELL   NA H NAH... What is good for WI SHH … Maybe  the  above list  has  more clues! 😄 Christmas time is indeed COOL There it is, THE PERFECT GIFT I know I just can't go wrong  Hope you have a wonderful time!                      Merry Christmas 🎁                          Secret Santa 🎅 **********************************

విజయ దశమి శుభాకాంక్షలు 2023

విజయ దశమి శుభాకాంక్షలు 2023 -- మల్లేశ్వరరావు పొలిమేర ****************కుమారి (కురరీరుతా)************ పడతులు నేడు - పండుగల వేడుకలో వడివడిగాను - బంధువుల కూడికలో పుడమినిఁ దాము - స్ఫూర్తినిడి యుక్తులతో నడవఁడి నెంచు - నాణ్యతగు శక్తులతో! (1) కొలుచుచు గౌరి - గోత్రముల రూపములన్ తలచుచు నమ్మ - స్థాయిల స్వరూపములన్ గెలుపును దెల్పు - కీర్తిపథ గానములన్ వలపులు నింపు - భక్తిరస ప్రాయములన్! (2) దశమున రామ - దర్శనపు శోభలతో అసురుల నగ్ని - నాహుతిడు పోకలతో నిశితపు దృష్టి - నిక్కమగు నేర్పులతో వసతుల హర్ష - వర్ణముల కేళిలగున్! (3) ఇల బతుకమ్మ - నెమ్మికల చేరువతో నెలవగు చుండి - నెయ్యమగు నోములతో కలకలలాడు - గానముల నాట్యముతో కొలుతురు నంత - కోర్కెలను దీర్చుటకై! (4) ********************************************* కుమారి (కురరీరుతా) కుమారి పద్య లక్షణములు ఈ పద్య ఛందస్సుకే కురరీరుతా అనే ఇతర నామము కూడా కలదు. వృత్తం రకానికి చెందినది శక్వరి ఛందమునకు చెందిన 7088 వ వృత్తము. 14 అక్షరములు ఉండును. 18 మాత్రలు ఉండును. మాత్రా శ్రేణి: I I I - I U I - U I I - I U I - I U 4 పాదములు ఉండును. ప్రాస నియమం కలదు ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్...

అమ్మనాన్నల యెడ

సీ. మనసుమెచ్చెడి ప్రేమ తనువునిచ్చెడి ప్రేమ అమ్మనాన్నల యెడ కమ్మనౌచు పరిణయమైనను, పయనములైనను దూరముండుట నిటు భారమౌచు పలకరింపుల తోడ పులకరింపులు గాని కలుచుచున్నటి రోజు కానరాక మంచి జీవితమిచ్చి మించిన నాయుస్సు తోడులేమను ధ్యాస తొలచు చుండె! తే.గీ. వారు గర్వించి నభివృద్ధి చేరుటకును వారి పౌత్రుల నభిలాష తీరుటకును దూరభారముల్ లెక్కింప త్రోవయందు మమ్ము గుర్తించి దీవించు మమత జాలు!

జీవితము - మమతల సుధలు

 సీ.  జీవిత మన్నను చేతిని వ్రాయుట  కాదు సుమండోయి, వాదు లేల నవ్వులు నాలుగు పువ్వులు బోలెడు  పొందుకైనను జాలు విందుకాద!   బంధములన్నవి యందిన జాలును  ప్రేమల పల్లకిన్  ప్రీతి యగును ఆశతో ముందుకు శ్వాసగా నడుచిన మధురానుభూతులున్ మనవి కావ!   తే.గీ. మమతల సుధలను జిలికి మనసు కొఱకు సమతల విలువలు బలికి సహితమవుచు  సుమధుర సరసములొలికి సురల సరస అమరము తలచు తరముల సుమముల యెడ! 

మీ ముందు మనబడి -మేమంత నిలబడి

సీ. మీ ముందు మనబడి -మేమంత నిలబడి తెలుగుకై లోబడి -తెరచిన బడి ముసిముసి నవ్వులు -పసిబుగ్గ దివ్వెలు బాలబడిని బాల -మాల యగుచు పదులలో జట్టుగ -పదముతో పలుకుతూ వినయమున్ వలఁచు ప్రవేశపు గుడి  నేర్చిన తెలుగును నెయ్యము తోడ ప్ర సూన ప్రకాశపు వేణువైన!  తే.గీ. మోదమై కెల్లరందు ప్రమోదమౌచు  బుద్ధిమంతులై జేరు ప్రభోదమందు సుద్దులన్ని నేర్చుకొనుచు చూఱగొనుచు ఒద్దికైన తెలుగు బాలలొడిసి పట్టె!     --- మల్లేశ్వరరావు పొలిమేర       09.10.2023

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

Image
తే.గీ. రాని దేమంటు నేర్పుచు ప్రగతి నాటి,  మదిని మీటిన గురువుల మఱపు రాక,  క్రిష్ణుని తలచుచు నుతింతు ప్రేమము, యది  పద్య పదముల నల్లుచు, ప్రణతి ప్రణతి! ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు  నాకు గురువులు అయి, గురువులుగా ఎంతో మందికి విద్యాదానము చేస్తున్న నా కుటుంబ సభ్యులను ఉంచి, రాధాకృష్ణుని తలచుచుఁ వారికి అర్పిస్తున్న ప్రణతులు.  "రామకృష్ణుని తలచుచు నుతింతు ప్రేమము" "నారాయణ"   ... మల్లేశ్వరరావు పొలిమేర 09.05.2023

రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు

సీ.  దూరమైననుగాని చేరువైనను గాని సరితూగు యమ్మకు  సాటి యెవరు? అన్నదమ్ములు తన ఆత్మబలము యంచు కన్నవారింటను కాంచు నెవరు? కష్టసుఖాలలో కార్యనిర్వహణలో తనవారు యని వాలు తాప సెవరు?    వలపు పంచుటలోన తలపు నింపుటలోన అక్కచెల్లెలకంటె నెక్కువెవరు? తే.గీ.  రక్ష కట్టగ బంధమ్ము రమ్యమయి, ని  రీక్షణలు వీడి తోబుట్టు ప్రేమ పొంది,  వీక్షణములన్ని వెలుగొంది స్వీయ మయిన  నా క్షణముల మధురిమలనంది చూడు! 

తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు

 *******తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు***** సీ. తెలుగువాడిని జూసి తెలుగు గ్రేటనిపల్కి యక్కున జేర్చగ నెక్కుపెట్టి మాతృభూమిని వీడి మనయూరి సంస్కృతి నన్యదేశములలో నాలపించి! మనబడుల్ నెలకొల్పి మనజాతి మేల్కొల్పి మనబిడ్డలకు నేర్పి మంచి భాష గిడుగు వారిని బోలి యడుగుజాడలనెంచి మనవారిపెంపుకై మార్గమెంత్రు! తే.గీ. తెలుగు భాష సేవకులయి నిలుచు వారు భాషతోబాటు బాధ్యతల్ పంచుచున్న తెలుగుతల్లికి లోటేమి? వెలుగ నెపుడు నుత్సవమ్ములే జరుపుచునుందురు గాద! ---మల్లేశ్వరరావు పొలిమేర 08.29.2023     

హ్యూస్టను ప్రాంతీయ సదస్సు

సీ. మనబడి సదసును, మనభాష నాడిని హ్యూస్టను నడిఒడ్డు యోగ్యమవుచు  ప్రాంతీయ కూర్మితో భాషా ప్రణాళిక,  మేధామథనములన్  మేళవించి భావితరాలకు బంధుత్వమొనరింప  తెలుగుతల్లి ఒడిలో నిలువరించి అధ్యాపకులను సమన్వయకర్తలన్ సరికొత్త స్ఫూర్తిని సాధ్యపరచె!  ఆ.వె. ఆహ! ఏమి వీర వారి ఆతిధ్యము, అన్నపూర్ణ సహిత వన్నెతెచ్చి తెలుగు తనపు విహిత వలపులనందించి నేరుగా మనసులు చూఱకొనిరి! -- మల్లేశ్వరరావు పొలిమేర  -- 07/17/2023

తెలుగు భాష

  సీ.  ఎంతటి భాగ్యము నెంచక జూసిన  నెచ్చట కేగిన నెదుగు భాష  అంతట వ్యాప్తమై అంచెలు దాటుచున్ అందరి మన్ననలందు భాష  ఆంధ్ర, తెలంగాణ సంధాన ఖగముయై  ఎల్లలు దాటుచు చెల్లు భాష తరముల పెన్నిధై స్థాయినెరుగునది   పిల్లల సొత్తునౌ కెల్లరందు/డల్లసందు  తే.గీ. తెలుగు వారమై నిలుపుట ధ్యేయమవుచు  తెలుగు భాషలో నడవడికలను నేర్పి  తెలుగు పిల్లలన్ నేర్పిన దేశభాష, తెలుగు తరములు నేకమై వెలుగ గలవు!

ఆశ

సుధగారి కథకు పద్యపు స్వేచ్ఛానువాదము  తే.గీ.  ఏమి నాశించకుండుట నిచ్చు మనకు   చాలినంతటి తృప్తిని వీలుజూపి కొంచెముంచిన నాశలో కోరవచ్చి పొందరాకున్న ప్రతిసారి చింత గలుగు ! -1   ఆ.వె.  చదువుచున్న దిట్లు మధురిమ మంచివౌ మాటలన్ని నవ్వుకుంటు తాను ! ఆశ పడక నున్న శ్వాసలో మౌనమ్ము జీవితమ్ము కాదు , భువిననుకొనె ! -2 ఆ.వె.  ఎట్టి వారికైన నెనలేని కోరికల్ ఎట్టి దశనునైన పుట్ట గలవు   ఇట్టి భావమందు గట్టిగా నమ్మిన పెట్టిపుట్టినపుడు విడవటేల !-3 తే.గీ.  ఓపికయు , డబ్బు కలిగి నారోగ్యమున్న ఆశ పడుట సహజమౌచు అందిపుచ్చు తాను నమ్మిన వాదన తలచు నెపుడు  మనసు కోరిన చాలుగా వనిత యందు-4 మత్తకోకిల. బాల్యమందున చూడముచ్చటి పల్లెసీమలు చుట్టుచున్ లౌల్యమందు విహారయాత్రల లాలిపాటలు పాడుచున్     తుల్యమౌచును తల్లిదండ్రులు తోచినంతన చూపగా బాల్యజీవిత శోభలెన్నని పంచుకుండుచు నాత్రమున్! - 5 లౌల్యము = ఆశ  తే.గీ.  తనకు నూతన దేశములనిన ప్రీతి  కనుక నెక్కడ జెప్పిన వినుచునుండె  ఆదివారపు పత్రిక చదువుకొనుచు   జూడు, ననుబంధ శీర్షిక ...

పితృ దినోత్సవం - లయగ్రాహి

  లయగ్రాహి అమ్మవెనుకుండుఁ   దను ,  నమ్మికపు   ప్రేమఁ   దను ,  చెమ్మఁజెమటల్   విడిచి  రొమ్మువిరబూయున్ సొమ్ములనుఁ   గూడ్చిఁ   దను ,  దమ్ము   రుచుజూపుఁ   దను ,  వమ్మవని   వారథిని  రమ్మనుచునుండెన్ తిమ్మురనిఁ   దిట్టుఁ   దను ,  లెమ్ము   యని   నొడ్డుఁ   దను ,  చెమ్మలనుఁ   గంటియెడఁ   జిమ్మనిది  " నాన్నై "  " అమ్మ "  యనిఁ   బుత్రికను , " కొమ్మ "  యనిఁ   బుత్రుడిని ,  నెమ్మికలుఁ   బంచు   తనుఁ   గమ్మటి  గృహమ్మున్ ! కొప్పరపు సోదరకవులు నల్లి మల్లెలును మొల్లలును జల్లినను శయ్యపయి నల్లియొకఁడుండ సుఖమెల్లయును బాడం చెల్లరు వచింతు రటు లెల్లిదము సేయఁదగ    దల్ల కుసుమాంబకుని భల్ల మదియందున్ వల్లభుఁడు కాంత ముదమల్లుకొన సెజ్జఁగనఁ  బెల్లెగసి నిద్ర తనువెల్ల మఱపింపన్ ఝల్లుమనఁగుట్టి రతి నుల్లములు దన్పి భళి  వల్లెయని వారి నుతులల్లపుడే గంటన్ లయగ్రాహి పద్య లక్షణములు వృత్తం  రకానికి చెందినది ఉద్ధురమాల  ఛందమునకు చె...