సామాజిక పద్యాల పోటీ కొరకు...
ఉ. తధ్యము, మంచి భావనలు తాకగ మైమరపించె చిత్తమున్,
పద్యము నేర్చి పంచుకొని భావితరాలకు బాటవేయుచూ,
హృద్యము నిచ్చుచుంటిని సుహృత్తులకూ ప్రజ-పద్యమందునన్
పద్యములారు నేను సుత బంపుత రేపటి రాత్రి వారకున్.
సమాజములో సాంకేతిక సాధనము
‘అంతర్జాలమున్ చరవాణి’
*****************************************************
శా. అంతర్జాలమనే మహోన్నతిని, మాయాజాల మాధ్యంబుగా
పంతంబున్ తగు సృష్టిచేసి, నిలలో సంధించెనే మానవుల్
వింతన్ మానవుడన్ని కార్యములలో బంధింపబడ్చున్న తా
నంతర్జాలముకే విధేయుడవుతూ నాధారభూతుండయెన్
కం. అంతర్జాలము వాడుతు
సంతోషము నిచ్చు చుఱుకు-సాధనములుగా
చెంతకు జేరి తెర వెనుక
చింతల నన్నియును పెంచి చేవను చెఱచెన్
ఆ. సంఘ మందు చేరు చరవాణుల వలన
పక్కవార్ని వదిలి పలుకుతుండ్రు,
చూడలేరు నెవరు చుట్టుపక్కలకూడ
ఒక్క నిముష మన్న నొదలకుండ్రు
కం. వంకర పద్దతులన్ విడి
సాంకేతిక ప్రగతి వాడు సమయస్ఫూర్తిన్
మంకుతనము వీడినచో
సంకోచించకనె పొందు సత్ఫలితమ్మున్
ఉ. వాడకు హెచ్చుగాను చరవాణిని నిద్రకు ముందు నెప్పుడూ
వీడకు గుండె ముందెపుడు వేడిగనూ, కదిలేటి కాలమున్
చూడకు బండిలో నడుపుచున్ యిడు జాగృతి నీ విధంబు, కా
పాడును నీదు జీవితము భద్రముగా సుఖశాంతులిచ్చుచున్
కం. ఆప్తుడగును జనులయెడ
క్లుప్తముగా విషయమిచ్చి కోరిక తీర్చెన్
జ్ఞప్తినొసగు చరవాణులు
ప్రాప్తంబయి నున్నచో యుపకృతి నిడుదునే!
అంతర్జాలము = Internet
చరవాణి = Mobile or Cell
చుఱుకు-సాధనములు = smart devices
సాంకేతిక ప్రగతి = technological development
కదిలేటి కాలమున్ = vibrating time
********************************************************************