Tuesday, May 1, 2018

గౌరినిఁ దల్చి

గౌరినిఁ దల్చి
*********************************************************************
ఉ. గౌరినిఁ దల్చి వ్రాయుటకుఁ గైతలుఁ బూనిన నేమి భాగ్యమౌ
కోరుఁచు భక్తిభావములుఁ గూర్చగ వచ్చిన మోదమే గదా
దారులు నన్నిఁ జూపుచును ధన్యము లిచ్చినఁ జాలునంచు నే
చేరెద శ్రేష్ఠమార్గమును శ్రేయముఁ గోరుతు ముక్తి నొందుచున్! (1)

ఉ. అమ్మనుఁ గూర్చి యక్కఱనుఁ నక్షరరూపము నిల్పుచుండగా
ఒమ్మికఁ గల్గుచున్ కవిత లుత్పలమాలనుఁ గూర్చవచ్చుచున్
నమ్మిన గౌరి కంకములు నాలుగు పాదములంద మర్చుచున్
కమ్మని సేదతీర్చగనుఁ గావలసున్నది యేమి యుండునో! (2)

ఉ. అందునఁ దెల్గు యక్షరములన్నియు హారపువంపుసొంపులన్
పొందుకఁ గల్గి, పూర్ణమునుఁ బోలి, ధరించుట కెంత శోభయో!
అందముఁ నెక్కుపెట్టుచుఁ ననంత ప్రకాశము నిచ్చి పార్వతిన్
డెందముఁ నందు నేనిడుమడించెద మోక్షపు మార్గ శోధనన్ ! (3)
*********************************************************************