Wednesday, January 15, 2020

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి శుభాకాంక్షలు
*****************మనోరమ*******************

వెలుగులందు నేవి దివ్వెలై,
వెలుగు మంటలాయి  భోగిలో
తెలుగు పంట చేతి కందగా   
తెలుగు వారి కేది పండుగౌ? (1)

తెలుగు సంకురాత్రి వచ్చెరా
కలువలెన్నొ తోక ముగ్గులో
జులుపు నాడపడ్చు శోభలో
వలపు మించునయ్య బంధమున్ (2)

డగిలిమూతలాడ వచ్చుచున్
వగరు జూపు బావ రోషముల్ 
టిగియు నెడ్లబండిలెన్నియో!
దిగుచు కోడి పందెముల్! అహో! (3) 

మనసు పెట్టి నమ్మ వంటలో
కనుచు తీపి పాక మెంతయో,
కనుమ రోజు చెక్క ముక్కలై 
మునుగు భక్షకమ్ము లెన్నియో! (4)

తగిన స్నేహబంధనమ్ముతో
తగిన ప్రేమబంధనమ్ముతో 
తగిన రీతి చందనమ్ముతో
తగిన నేటి, పెద్ద పండుగౌ (5)
************************************
మనోరమ
వృత్తం రకానికి చెందినది
పంక్తి ఛందమునకు చెందిన 344 వ వృత్తము.
10 అక్షరములు ఉండును.
14 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I I - U I U - I U I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు న , ర , జ , గ గణములుండును.

మల్లేశ్వరరావు పొలిమేర
01.15.2020