ఓ
ఒంటరి ఆశల పల్లకి .....
మదిలో మెదిలే మౌనరాగముగ వెదికే కళ్లకు
విరహాతాపమయి వయసుకు తోడయి వలపులు వలచి పయనము నెన్నడు పంచగా రాక పసికందు
బుగ్గన ముద్దుగ రాక ఆశగా
వెదకినా అమ్మగా రాక నాన్నను మాటలో కమ్మగ రాక చిన్నగా వెదికిన చేతునా
రాక ఈడుజోడగు
నేడు నిచ్ఛను రాక ఏడలేనట్టి
బంధమున్ననూ రాక ప్రేయసి జూపెడు పిలుపున
రాక రేయిని మూయని రెప్పనీ రాక పరిణయమైనను
పలుకగ రాక విరివిగా
యద వెలుపకూ రాక |
అహంతో నిండిన అర్ధాంగిని రాక సహనమున్నను సంతృప్తికై
రాక స్వార్ధపూరిత
హృదయాలను రాక అర్ధవంతమయినా
నలజడిలో రాక బంధములందున బాధ్యత తోడై అందని ప్రేమల ఆశల పల్లకి ----- పొందిన
దెటులన బుట్టగా బిడ్డలు విందుల
నెన్నియో విరాజిల్లె నాడు కన్నబిడ్డల నమ్మకమ్మున
ప్రేమ మిన్నగ తలచును మమతల
ప్రేమ స్వచ్ఛత
నిండిన సహృదయ ప్రేమ మెచ్చగ
వచ్చెరా మేదినిలో ప్రేమ నోములు నెన్నియో నోచిన
ప్రేమ నీమము లేనట్టి నిచ్చల
ప్రేమ నిండుగ
మదిలో నిండిన ప్రేమ మెండుగ
జీవము మేల్కొను ప్రేమ ----- |
మల్లేశ్వరరావు పొలిమేర 7/31/2021