Monday, April 17, 2023

పద్య రచన

 

తే.గీ.

తెలుగు వ్రాయటంలోఉంది తీరుతెన్ను  

మలచి పలుకుటలోఉంది మాటతీరు

పలికి మెలగుటలోఉంది భావప్రాప్తి

దేశమేదైన ఆంధ్రత్వశ్వాస ఒకటి!

 

.వె

మాతృభాష నెపుడు మరువకురో రన్న 

భాష తెలుపు జాతి భావ మెపుడు

ఎన్ని భాషలున్న ఎదను మీటు తెలుగు,

నేర్పి నిలుపు చూడు కూర్పు కలుగు.!