Monday, July 17, 2023

హ్యూస్టను ప్రాంతీయ సదస్సు

సీ.

మనబడి సదసును, మనభాష నాడిని

హ్యూస్టను నడిఒడ్డు యోగ్యమవుచు 

ప్రాంతీయ కూర్మితో భాషా ప్రణాళిక, 

మేధామథనములన్  మేళవించి

భావితరాలకు బంధుత్వమొనరింప 

తెలుగుతల్లి ఒడిలో నిలువరించి

అధ్యాపకులను సమన్వయకర్తలన్

సరికొత్త స్ఫూర్తిని సాధ్యపరచె! 

ఆ.వె.

ఆహ! ఏమి వీర వారి ఆతిధ్యము,

అన్నపూర్ణ సహిత వన్నెతెచ్చి

తెలుగు తనపు విహిత వలపులనందించి

నేరుగా మనసులు చూఱకొనిరి!

-- మల్లేశ్వరరావు పొలిమేర 

-- 07/17/2023

Monday, July 3, 2023

తెలుగు భాష

  సీ. 

ఎంతటి భాగ్యము నెంచక జూసిన 

నెచ్చట కేగిన నెదుగు భాష 

అంతట వ్యాప్తమై అంచెలు దాటుచున్

అందరి మన్ననలందు భాష 

ఆంధ్ర, తెలంగాణ సంధాన ఖగముయై 

ఎల్లలు దాటుచు చెల్లు భాష

తరముల పెన్నిధై స్థాయినెరుగునది  

పిల్లల సొత్తునౌ కెల్లరందు/డల్లసందు 

తే.గీ.

తెలుగు వారమై నిలుపుట ధ్యేయమవుచు 

తెలుగు భాషలో నడవడికలను నేర్పి 

తెలుగు పిల్లలన్ నేర్పిన దేశభాష,

తెలుగు తరములు నేకమై వెలుగ గలవు!