Sunday, January 14, 2024

సంక్రాంతి శుభాకాంక్షలు

సీ. 

తెల్లవారక ముందు నీళ్లుపై జల్లుచున్

స్నానమాడమనుచు నమ్మ లేప

ఇంటిముంగిళ్లలో నిండుగా ముగ్గోసి

వాని సందడులతో  బడతులుండ

గోవుపిడకలతో గుమ్మము ముందర 

భోగిమంటలనేసి కాగుచుండ  

హరిదాసు గానాలు నహ్లాదమొనరింప

పెద్దపండుగ నాడు బిలుచు చుండు 

తే.  

నేటి సంక్రాంతి శోభలన్ సాటి జెప్పి  

తెలుగు వలపులు నింపి దేదీప్యమౌచు

భోగభాగ్యముల్ చేకూర్పి, పొందు కలిగి

వెలుగు చుందురె మీరంత విశ్వమందు  

… మల్లేశ్వరరావు పొలిమేర 

01.14.24