Monday, February 12, 2024

మనబడి సదస్సు

 సీ. ఆతిధ్యమేయది ఆతిధ్యమేయది 

అందలమెక్కెను ఆశకూడ

శాక్రిమెంటో మనసార మనసుదోచి 

పంచభక్ష్యములను పంచనుంచి

పవన సమూహపు పలకరింపులతోడ

బహుముచ్చటైనటి ప్రాంగణమయి  

సంగీత, నృత్య, ప్రసంగాల కీర్తనల్ 

మైమరపించగా మాటలేల!


తే.గీ. ఆట,పాటలంత్యాక్షరి లన్ని కలపి 

అంత్యవేళలో హాస్యలహరిని తలపి

మూడురోజులు తక్కువేమోయనుండె!

అందరికి మా తరుపు  ధన్యవాదములివె!