Wednesday, March 27, 2024

ఉగాది 2024 - నా బాల్యము

 

పేరునకు ఉగాది, తలచు ప్రేమలు లేవోయ్ 

చేరువగు అగాధ వలపు చిత్రము లేనోయ్ ,  

కోరుకొను సుగంధమనెడి క్రొత్తవి కావోయ్ 

దూరమయిన పండుగ మరి దొర్కుట నేమోయ్! (1)


తుళ్లిపడుచు నిద్రవిడచి తోటల చెంతన్ 

పల్లెవలపు పంచుకొనుచు పాటలు తోడై  

అల్లుకొనగ వేపచిగురు నాత్రుత తోడన్ 

మల్లుతిరిగి కొట్టుకొనుచు మామిడి కాయల్! (2) 


బాల్యమునవి స్నేహమునకు బాటలు కావా 

తుల్యపు మన జీవితములు తోడగు రోజుల్  

మూల్యమువలె జూడవలదు ముచ్చటలేగా 

బాల్యమున ఉగాదినొదుగు పండుగ రోజుల్ (3)



***************************************************

శంకర1 పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. అతిశక్వరి ఛందమునకు చెందిన 7135 వ వృత్తము.
  3. 15 అక్షరములు ఉండును.
  4. 20 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణిU I I - I I U - I I I - I U I - I U U
    • త్రిమాత్రా శ్రేణి: U I - I I I - U I - I I I - U I - I U - U
    • చతుర్మాత్రా శ్రేణి: U I I - I I U - I I I I - U I I - U U
    • పంచమాత్రా శ్రేణి: U I I I - I U I I - I I U I - I U U
    • షణ్మాత్రా శ్రేణి: U I I I I - U I I I I - U I I U - U
    • మిశ్రగతి శ్రేణి (5-4) : U I I I - I U I - I I I U - I I U - U
  6. 4 పాదములు ఉండును.
  7. ప్రాస నియమం కలదు
  8. ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
  9. ప్రతి పాదమునందు భ , స , న , జ , య గణములుండును.

Sunday, March 10, 2024

మనబడి గురువుల కలయిక - 2024

 కలసి వచ్చితిరే 

తెలుగు పల్కులలో

వెలుగు పంచితిరే

వలచి మెక్వరిలో (1)


మనసు విప్పుటలో

కనులు నమ్ముటలో  

అనతి కాలములో

మనను కల్పినదే (2)