ఏమి వింతయో - ఉత్పలమాలలు
2019 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” లో ఈ క్రింది నా కవిత రెండవ ఉత్తమ కవిత గా ఎంపిక కాబడ్డాయి.
********************************
2019 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” లో ఈ క్రింది నా కవిత రెండవ ఉత్తమ కవిత గా ఎంపిక కాబడ్డాయి.
********************************
ఏమది
తట్టి లేపునది? యిట్లు నుషోదయ క్రాంతి పుంజమున్
ప్రేమలుఁ
బంచు బంధములఁ బేరుకుపోయిన భావ జాలముల్
నీమములన్ని నిత్యమయి
నేర్పుగఁ నుత్పలమాల నల్లగా!
నామది
నెల్ల పద్యముల నానుడి, హాయగు గాక నేమదౌ! (1)
కన్నుల
రెప్పలాడుచునుఁ గమ్మని కైతలకేగి చూడగా
చిన్నగ
వచ్చి దివ్యమగు జీవన యానపు జ్ఞప్తిఁ జూపుచున్
మన్నన
బొందు మానవుల మంచిని మాటల యందుఁ గూర్చుచున్
మిన్నగ
సారవంతముగ మీటిన జన్మము ధన్యమౌనుగా (2)
అంతట
లేచి పానుపున నాశలు భాషలు నెక్కు పెట్టుచున్
చింతలు
వీడి చేరువగు శ్రేష్ఠపు బుద్ధిని సాధనమ్ముతో
అంతరమందు
దైవమును నార్తిగఁ గొల్చుచు భక్తి నింపుచున్
వింతగ
మారు లోకమును విజ్ఞత తోడను విప్పు చుండెరా
(3)
బంధము
గాని బంధములు ప్రాసలుఁ గల్పెనుఁ బ్రేమ బంధమున్
బంధములన్ని
దూరమయి పంచుట నేర్వని ప్రేమ లెక్కువై
బంధము
గూర్చి పిల్లలకు భాద్యత తోడను నేర్ప లేకయే
అందరి
త్రోవ లోక్కటయి యందల మెక్కుట నేమి వింతయో
(4)
తంటల
నెన్ని చూచెదరు తక్కువ యైనను తిండి గింజలున్
వంటల
నెల్ల వద్దనుచు వక్రపు వంటకమందు వంగుచున్
పంటలు
సాగు రైతులను వంచన జేయుచు మంటఁ గల్పుచున్
కంటిరి
క్రొత్త లోకములుఁ గాంచక కంచపు కూడు వింతయై
(5)
తీరిక
లేదు మాటలకు తీయని బంధము లేల వచ్చునో
చేరిక
లేదు కూటమికి శ్రేయపు స్నేహము లేల వచ్చునో
కోరిన
లేదు కాలమని కోరు ప్రశాంతత లేల వచ్చునో
ప్రేరణ
లేని కార్యముల పెన్నిధియై యెదిగుండు వింతయై (6)
అజ్ఞత నందు సంస్కృతుల నక్కరపట్టని బోధనమ్ములన్
విజ్ఞత లేని విద్యలను విక్రియ రూపములందు నేర్చుచున్
ఆజ్ఞల తోడ వైరముల నంతట నింపుచు సృష్టిభిన్నమున్
ప్రజ్ఞత లేని శాస్త్రముల పంచన జేరుటనేల వింతగా (7)
మాటకు
మాటఁ బెంచుకొని మక్కువ తెంచిన తల్లిదండ్రులై
ధీటుగ
నేను గొప్పయను తిమ్మిరినందున వీడుచుండగా
చేటని
సంఘమెన్నడును జెప్పక బిడ్డల బాగులెంచకన్
పోటని,
మేటి వక్తలుగ భూమినిఁ నేలుట నేల వింతయో! (8)
వార్తలు
యన్నిఁ జేరునిటు వంచక సంస్థల దుష్ట శక్తులన్
కర్తగ
మారి దేశములు గాల్చుచు, శాంతిని రూపుమాపుచున్
వర్తక
హెచ్చుతగ్గులను, లాభము బొందుచు తాము గొప్ప సం
స్కర్తలునైన,
లోకమున కర్మలు కాంచుట లేల వింతయో ! (9)
వింతలు
యెన్ని నున్న మన విజ్ఞత తోడను మార్పు చెందుచున్
కంతలు
కట్టిపెట్టి మన కార్యములందున భక్తి నింపుచున్
మంతనమందు
మంచియను మర్మము నేర్చుచు సాగిపొమ్మురా
చింతలు
లేని జీవితము చిక్కును శ్రేష్ఠపు బుద్ధి తోడుగా !
(10)
మల్లేశ్వరరావు పొలిమేర
12/23/2018
No comments:
Post a Comment