Thursday, May 30, 2019

Sridhar - 2

JBL support 03794921

శ్రీధరునికి నా నివాళులు, ఏది ఏమైనా 
"స్వాగత" మిచ్చుటయే మన విధి.

*******************స్వాగతం ****************************

న్యాయదేవతను న్యాయము కో రా
ప్రాయమివ్వమని ప్రార్థన జేస్తూ
చేయిచాచినను శ్రీధరునందున్
శ్రేయమైనదని జీవుని కోరెన్  (1)

జీవనమ్మునకు చేరిన టెక్షాన్
సేవనిత్యమని చేరిన శాఖన్
భావజాలముల బంధము తోడన్
త్రోవ పంచుటకు తోడయి నాడే (2)

మాటలందునను మంచిని జూపెన్ 
తోటి వారికిని తోడుగ నుంటూ
ఆటలందు తను అందుచు బాలల్
మేటియౌచు తను మీటె మనమ్ముల్ (3) 

విందు జీవితము బిడ్డల కిచ్చే
పొందు లెన్నియునొ పోగుగ పోసే
చిందు లెన్నియునొ చెంతన పోసే 
అంది వార్తలిటు నంతనె వీడెన్ (4)

వారమవ్వగనె వాలుతు శాఖన్
తీరుతెన్నులను తెల్పిన వాడై
చేరువవ్వగల శ్రీధర పల్కుల్
వేరు చేయనటి విశ్వపు ఛాయల్ (5)

వందనమ్ము లివి బంగరు బిడ్డా
వందనమ్ము లివి ప్రజ్వల పుత్రా
వందనమ్ములివి భాగ్యపు పుత్రా
వందనమ్ములివి భారత బిడ్డా  (6)

***********************************************

స్వాగతం పద్య లక్షణములు
వృత్తం రకానికి చెందినది
త్రిష్టుప్పు ఛందమునకు చెందిన 443 వ వృత్తము.
11 అక్షరములు ఉండును.
16 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I U - I I I - U I I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు ర , న , భ , గా(గగ) గణములుండును.

మల్లేశ్వరరావు పొలిమేర
05.30.2019

No comments:

Post a Comment