Wednesday, June 19, 2019

Happy Fathers Day

కొంచెం ఆలస్యముగానైనా అందరి తండ్రులకు పితృదినోత్సవ శుభాకాంక్షలు .
Happy Fathers Day
********************గణనాథ************************
అన్నియును తానై యాశలనుఁ దీర్చున్
వెన్నెముక తానై ప్రేమలనుఁ బంచెన్
కన్నకల లందున్ కాపరిఁగ మారున్
నాన్న మనసేగా నమ్మగలఁ బ్రేమౌ (1)
చిన్న అడుగుల్ నా చేత నడిపించే
"చిన్న" యని తోడై చిక్కులను తీయున్
మిన్నయగు మాటల్ మేలుయని చెప్పెన్
నాన్న మనసేగా నమ్మగల ప్రేమౌ (2)
ఎన్ని తలపుల్ తాఁ నే విధముఁ దల్చున్
ఎన్ని వలపుల్ తాఁ నీ విధము పంచున్
ఎన్ని కలతల్ తాఁ నే విధముఁ గాచెన్
నాన్న మనసేగా నమ్మగల ప్రేమౌ (3)
కన్నులను దాచే కల్పతరువంటూ
ఎన్నగల శక్తే యేపుగనుఁ నిచ్చున్
మన్ననలు పొందే మార్పులనుఁ జూపెన్
నాన్న మనసేగా నమ్మగల ప్రేమౌ (4)
********************************************
గణనాథ పద్య లక్షణములు
వృత్తం రకానికి చెందినది
జగతి ఛందమునకు చెందిన 911 వ వృత్తము.
12 అక్షరములు ఉండును.
18 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I I - I U U - U I I - I U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు భ , య , భ , య గణములుండును.
మల్లేశ్వరరావు పొలిమేర
06.16.2019

No comments:

Post a Comment