పల్లెల పాడిపంటలనుఁ బామరులెల్లరు సాగుచుండగా
అల్లది పట్టణమ్ములను హద్దులు లేవని సాగు చూడరా,
ఎల్లరు పొట్టకూడికని నెంచిన నౌకిరి కేగుచుండగా
ఉల్లమునెన్నొ యూహలిటు నోర్పుగ నుత్పలమాలలూగెనో
…
"మానవ జాతి మన్నుగడ మాదని" కర్షకలోక మందులో
నా నవజాతి కష్టముకు నన్నపు గింజలు కూడ బెట్టగా
కానక కాలగర్భమున కార్యములందున వెట్టి చాకిరిన్
లోనగు పట్టణస్థులును లోకము తీరును చూడకుండిరే
…
పచ్చని పంటభూములను పల్లెల బాగుకు నెక్కుపెట్టుచున్
మెచ్చెడి క్రొత్తపద్ధతులు మీటుచు నాగరికమ్ము
నిల్పుచున్
స్వచ్చత నింట నిల్పుకొని సంస్కృతి నిండిన రాజ్య
సంపదై
వచ్చిన మార్పుమంచికని స్వాగతమిచ్చుచు సాగిపొమ్మురా …
శృంగములన్ని శోభయగు వృద్ధిని కోరుచు సామరస్యమున్
రంగములందు పాలకులు రాజ్యపు రాసులు రంగరించగా
భంగముగాక లోకులకు పల్లెలు, పట్టణముల్ సరాసరై
హంగులనెన్నొ నింపుకుని నందరి సౌఖ్యములెత్తి జూపురా …
శృంగములు = ప్రభుత్వాలు
No comments:
Post a Comment