*************కలరవము***************************
వసుదేవుని గృహమున బుడతవురా
అసి దేవకి హృదయపు శిశువవుచున్
నిశిరాత్రి యమున నది పయనముతో
దిశ నందుని గృహమున కొలువయెరా (1)
అనురాగపు యడుగులు వలపగ రా
మనసంత మురిపములు నిలుపగ రా
తనువంత ప్రియమవుచు తలపగ రా
కనులార కలవరము కలుపగ రా (2)
*****************************************************
కలరవము పద్య లక్షణములు
- వృత్తం రకానికి చెందినది
- శక్వరి ఛందమునకు చెందిన 8188 వ వృత్తము.
- 14 అక్షరములు ఉండును.
- 16 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: I I U - I I I - I I I - I I I - I U
- 4 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- ప్రతి పాదమునందు స , న , న , న , వ(లగ) గణములుండును.
No comments:
Post a Comment