*******************వసుధ ********************
ఇలశక్తివిగా
పలురూపములో
కొలువుండుచు నీ
వెలుగొందెనుగా (1)
తొలి పార్వతిగా
మలు లక్మివిగా
అల భారతిగా
వెలుగొందెనుగా (2)
నవరాత్రులివై
కవనమ్ములివై
పవనమ్ములిలా
ప్రవహించెనిలా (3)
నినుకొల్చుటకై
కనుచూపులలో
మనసంతటలో
మునుఁగుండెదగా (4)
భువిరాక్షసమౌ
కొవిడందుపడెన్
నవలోకములో
నవరోగములే (5)
ఒడుదుడ్కులతో
పడుపౌరులకై
ఇడు శక్తినిలన్
కడు వెల్గులతో (6)
***************************************
వసుధ (కిసలయ , తిలకా)
పద్య లక్షణములు
- ఈ పద్య ఛందస్సుకే కిసలయ , తిలకా అనే ఇతర నామములు కూడా కలవు.
- వృత్తం రకానికి చెందినది
- గాయత్రి ఛందమునకు చెందిన 28 వ వృత్తము.
- 6 అక్షరములు ఉండును.
- 8 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: I I U - I I U
- 4 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- ప్రతి పాదమునందు స , స గణములుండును.
No comments:
Post a Comment