తేటగీతులతోడ స్నేహితుని గురించి వాడి చివరి రోజు
********************************************
ఏమి రోజిది? స్నేహితుణ్ణిటుల జూసి
ఏమి చెప్పేది? ప్రాణమ్ము లేక పోయి
ఏమి లోకమ్ము? జీవితమ్మిట్లు మింగి
ఏమి న్యాయమ్ము? బంధమ్ము లెడ్చు చుండ? (1)
దూర మైనను స్నేహమ్ము చేరువౌచు
పాత మధురమౌ ఘడియలే ప్రణయ మౌచు
మాటలో తలచుచు వారి మంచి కోరి
బాల్య మిత్రుని తోడుండు బంధమేగ (2)
మచ్చు కైనను చూపక మభ్య పెట్టి
ఉచ్చుపడి కరోనాకిట్లు నోర్చలేక
విచ్చి హృదయములను నేడు వీడి నాడు
శేషు, కదలాడె బాల్యము చిత్రమవుచు (3)
వాడు పదిహేను సంవత్సరమ్ములాడి
బాల్య బంధమ్ము ప్రేమతో పంచినాడు
మాటలను, లేక మర్మమ్ము నేటి కైన
బాటలను బాధ్యతలు మోసి పంచినాడు (4)
కలసి ఆడిన రోజులు కల్లనాడి
కలసి చదివిన రోజులు కల్లనాడి
కలసి తిరిగిన రోజులు కల్లనాడి
కలసి అలసి/ఆర్తిగ కన్నీరును కల్లనాడె (5)
బడికి నడకలో తోడుండి బాట యందు
నిడివిన కథలతో మెచ్చి నింపుటోడు
ఒడిసిపట్టి దాటించుచు నొడ్డుపైకి
విడవ లేదు మేమెపుడును! వీడు టేల? (6)
నిడివి = పొడగు
అనతి కాలము తనకిచ్చి అంత మొంది
గౌరి మాతకు ఏముంది కనికరమ్ము
గర్భగుడిముందు నెదిగిన కన్న బిడ్డె?
మనసు నోర్వక నూరికె మలచు టేల (7)
********************************************
No comments:
Post a Comment