Sunday, September 11, 2022

2022 ప్రకాశం మొదటి రోజు

 తెలుగు వెలుగు చూపు ధ్యేయమై కదులుచున్ 

నిలుపు కొనగ భాష నెమ్మి కొరకు 

కొలువులెన్నియున్న విలువైన మనబడి 

మలచు తరములన్ని మంచి కొరకు (1)

భాష సైనికులయి భాద్యతల్ చేపట్టి  

వందలాది బిడ్డలంత యొదిగి  

ఇంటికొకరు చేరె నిర్వింగు నడిఒడ్డు 

డల్లసందు నేడు కళ్ళు చెదిరె (2)

మొదటి రోజు నిటుల మోదమున్ సమకూర్చి 

గురువు శిష్యలందు మెరుగు పరచి 

ఒదిగి పట్టుచున్న పదునైన పద్యముల్

కదిలె భాషనెడ  ప్రకాశ సేవ (3)  

నేటిబాలలంత మేటిగా ముందుండి 

తల్లిదండ్రులందు వల్లివేసి

తెలుగు భాష, సంస్కృతి నవనిలో చాటి

ఆంధ్రదేశమాత నాశ నిలిపె (4)   


No comments:

Post a Comment