Tuesday, May 30, 2023

ఐ.పి.యల్ ఫైనల్

 సీ. 

విజయమన్నది మన నిజజీవితపు కేళి

నిన్నటి ఐ.పి.యల్ నెంచి జూసి 

ఆడుటలోనుంది అద్వితీయ ప్రతిభ

గెలుచుట, ఓడుట నిలుచుటకని 

చివరి బంతి వరకు నెవరు పోరాడినన్

తృటిలోన జారిన తృప్తి పొందు

అంచనాలకు మించి పొంచియుండు గెలుపు

వదలవలదును చెందదని వీడి

తే.గీ. 

ఏమది? సి.ఎస్.కె ఎదురీత నేమి జూపె!

ఏమది? జి.టి. పోరాట పటిమకు సాటి!

చూడ ముచ్చట నాటయి వేడుకైన

నేర్పుజూపించె యువతకు నేటి గెలుపు!   


  
 



Sunday, May 21, 2023

ప్రకాశపు స్మృతములు

సీ. 

మనబడి ఇర్వింగు ఎనలేని స్మృతములన్

నా యందుఁ నుంచుచుఁ  శ్రేయ మయ్యె!

"భువన" ఉచ్చారణ పోలికలో నిడు 

తికమక తలపులన్  తేల్చ వలసి,

"సాయి" మౌనాన్ని, ఏమాయ చేయుచు సమా

ధానాన్ని రాబట్టు స్థాయి నెఱిఁగి,

మాటకో ప్రశ్న నారాటము నాపక 

సంధింపఁజేయుఁ  క్రిష్ సంశయాలు 

తే.గీ. 

కీర్తన చిరుతిండ్లయెడ సంకీర్తనాలు

అటునిటున చార్వి, అనిరుథ్ల హాస్యకేళి 

ఎదురనున్న హేమిష్ వ్యంగ్య వేషములయి 

చూడ చక్క ప్రకాశపు స్కూలు మాది 

 




 




 
 


 






Wednesday, May 10, 2023

పెదపూడి మల్లికార్జున రావు గార్కి

 



తెలుగు నేర్పుటలోతను ధ్యేయమవుచు 

తెలుగు పద్యములోతను నిలిచి పాడి  

తెలుగు గద్యములో తను విడమరచుచు

తెలుగు భాగ్యపు భావముల్ పలికి నారు ! (2)