ఈ రోజు మన గురువుల ధ్యేయానిరతిని చూస్తూ ...
ఆటవెలదులలో ..
చెప్పదలచినాను చిన్నమాట నయన
ఎంతగొప్ప గురువులందరికడ
బాలలందు తాము బంధమ్ము ముడివడి
చెంత జేరవచ్చె నంత కలసి (1)
తల్లిదండ్రులంత అల్లగురువులంత
తెలుగుతల్లి యందు పలుకులిడుచు
బాధ్యతాయుతమ్ము పంచుకున్న తలపు
అందిపుచ్చుకున్న ఆత్మబలము (2)
నేర్చుకొనుట కన్న నేర్పుట కష్టమ్ము
బాలలందు నోర్పు బహుళ గాద
సంకటములు దాటి సంస్కృతిని నిలిపి
సంస్కరించు మీకు వందనాలు (3)
No comments:
Post a Comment