Sunday, April 30, 2017

మనబడి పిల్లల పండుగ

"పిల్లల పండుగ" జరుపగ
నుల్లము నానందపడుచు నోహో యనుచున్
తల్లులు తండ్రులు గురువులు
పిల్లల ప్రతిభను గని మురిపించెను గదరా!

Saturday, April 15, 2017

శివమావయ్య, వరలక్ష్మి అత్తల రజతోత్సవము


మ. అత్త మావల పెళ్లి రోజిది యాత్మనిండుగ వేడుకే
పొత్తుగన్ రజతోత్సవమ్మును పూనుకొంటిరి హృద్యమై
ఎత్తగన్ శివ, లక్ష్మి తోడుగ మెప్పుపొందుచు నెప్పుడున్
హత్తుకొందురు బంధుమిత్రుల యందు దీవెనలన్నియున్


Thursday, April 13, 2017

ఆటవెలది

ఆటవెలది యెపుడు నాది పద్యరచనన్
ఆటవెలది మనకు యాస పెంచు
ఆటవెలది నిచ్చు నాత్మనిబ్బరతను
ఆటవెలది నాడు యాట యాట!

Tuesday, April 11, 2017

కవి గొప్పతనము

కవి గొప్పతనము (నా మిత్రుడు చెప్పిన మాటలు పద్య రూపము)
అంబురుహము
ప్రతి పాదమునందు భ , భ , భ , భ , ర , స , వ(లగ) గణములుండును.
13 వ అక్షరము యతి స్థానము
**********************************************************************
వేదన జెందిన మానవుడెప్పుడు బ్రేమ లేమిడి నోర్చి, తా
సేదను దీరును దల్లి యొడిన్, కవిచెంతనన్ పలు కైతలన్.
నాదని స్వార్ధముగా తన బిడ్డలనాదరించగ దల్లియున్,
కాదని యందరి బాధను మోయుచు గాచగన్ కవి ధన్యుడౌ.
**********************************************************************


Monday, April 10, 2017

ధనికొండ గారి సమస్య: "కూర కూర కూర కూరక నిక "

సమస్య- "కూర కూర కూర కూరక నిక "
ఒక నత్తియున్న వాని ప్రతిభ, వాని మాటల్లో ...
*********************************************
ఆ. నత్తియున్నదనుచు నలుగురి మన్నన
కూర కూర కూర కూరక, నిక
ఎట్టకేలకు కలమెత్తి పండితుడునై
పద్య రచన యందు ఫలితమొందె.
*********************************************


Friday, April 7, 2017

ఛందస్సు

****************************
కం. ఛందస్సు కూటమి కఱపు
ఛందస్సు మెళుకువలన్ని శ్రద్ధగ వినుమా,
ఛందస్సు కూడిన తలపు
ఛందస్సును తీర్చి యిచ్చు సాతము కనుమా!
****************************

కఱపు= భోదించు, ఛందస్సును = కోరికను, సాతము = సంతోషము

Thursday, April 6, 2017

గవరపేట

చిన్నప్పుడు స్నేహితుడు పలకరించగా ..పెంచి పెద్దచేసిన ఊరు గుర్తుకు వచ్చి...
************************************************************************
ఉ. అమ్మయి గౌరి దేవి వెలయంగ పునీతము జెందు పేటయే,
అమ్మయి సత్యవాణి వినయంగ సుపుత్రుల నీడు పేటయే,
అమ్మకు యమ్మ పార్వతి ప్రియంగ సువిద్యను నేర్పు పేటయే,
పిమ్మట వీడగన్ గవర పేటను, గుర్తుకు వచ్చెనంతయున్.
************************************************************************


Tuesday, April 4, 2017

శ్రీరామ నవమి

******************************************************
ఉ. "ఉంగరమందుకొన్న కపియోధుని యుల్లము పల్లవించె స
ర్వాంగములందు మేను పులకాంకురముల్ వహియించె, చిత్తము
ప్పొంగె ముదమ్మునన్, ధరణీపుత్రికనే కనుగొన్నయట్లు , క
న్నుంగవ నుండి రాలినవి నూతన హర్షకవోష్ణ బిందువుల్ "
******************************************************

ఆనాడు రామచంద్రమూర్తి సీతమ్మతల్లి అన్వేషణలో అన్నికోట్ల వానరులలో ఒక్క హనుమమీద విశ్వాసంతో
రామనామాంకితమైన ఉంగరాన్ని ఇచ్చినప్పుడు హనుమకు " మనస్సు ఉప్పొంగి పోయినదట,
అన్నీ అవయవాలు పులకించిపోయాయట, ఉంగరం అందుకున్న
వెంటనే ఆ సీతమ్మను కనుగొన్నంత ఆనందం కలిగిందట ".
కేవలం ఉంగరమందుకొన్న హనుమ అంతగా పులకించిపోతే ,
మరి మనం ఆ 'సీతారాముల కళ్యాణం' జరిపి ఎంత పులకించిపోవాలి ?

అనే బాలుగారి ఆహ్వానానికి ఉత్తరముగా ...నా పద్యము
******************************************************
ఉ.ముంగిట సీత- రాములకు ముచ్చటగొల్పుచు పెండ్లి జేయఁగన్
రంగుల శోభనిచ్చుచును రమ్యముగా వెలిగొందు దంపతుల్,
మంగళమౌచు జీవితము మానస మందున దివ్య కాంతులన్
పొంగుచు, జేయువారులకు పుణ్యఫలమ్మును కల్గుచుండెడిన్.
******************************************************


Monday, April 3, 2017

డల్లాసులో వర్ష ప్రతిపద (ఉగాది) పండుగ విశేషాలు

క్షీరసాగరమున చిన్నారులు మధించి
నందచందమయె నానంద శాఖ
భిన్నత్వమందు చూపించె నేకత్వమున్
ఆదర్శ, ప్రేరణ శాఖ లనుగి
దేశభక్తి నిరతి దెలిపి యాడిరి వందె
మాతర గేయమ్ము మైత్రి శాఖ
సంఘటించి హనుమాన్ చాలీసు పఠనతో
సంక్రమించెడును సంస్కార శాఖ

బాలలంత ముద్దులొలికి పాడి యాడి
వర్ష ప్రతిపద శోభయై హర్ష మిచ్చె
బంధువులుగ డల్లాసు విభాగ మొందు
సంతసమునకు, సరదాల కంత మేది!