**********************మంజుభాషిణి ***************
కనవోయి మానవుడ కథ ఏమిటో
వినవోయి మానవుడ విధి ఏమిటో
పనిలోన ప్రాణమిడు వధ ఏమిటో
రణరంగమై నరుని రధ ఏమిటో (1)
కలలోన కోరనిది కనిపించగా
విలువైన జీవితము విలపించుచున్
ఇలలోన మానవుని నెదురుండు ఈ
కలతల్ కరోన కృతి గమనమ్మురా! (2)
ఎటుపోవు లోకమయి ఎగబాకెనో
మటుమాయమౌచు నిటు మరలించెనో
వెటకారమౌచు నిల విధియోగమున్
కిటుకేల బోధపడు క్రియమాణమున్ (3)
ఒదుగుండు జూపుచు నిరుపయోగముల్
కదలాడి పేర్చునిటు కడు కష్టముల్.
ఒదుగుండు జూపు బువి కుపయోగముల్
పదిమంది కల్మషము ప్రకటించకన్ (4)
మన తోటి బంధములు మన తోడుయై
మన వారి యొద్దికలు మన విందుగా
మన భావయుక్తములు మన సందడై
మన గుర్తులౌచు నది మన సౌఖ్యమౌ (5)
తనరూపు దైవమయి తగు భుక్తులన్,
తనరూపు దైవమయి తగు వైద్యమున్,
తనరూపు దైవమయి తగు విద్యుతున్,
మనకిచ్చు మానవులు మన దేవతల్ (6)
********మల్లేశ్వరరావు పొలిమేర 03/23/2020***********
రధ = హింసించుట
కృతి = work
కడు = అత్యంతము
బువి = భూమి
భుక్తి = భోజనము
మంజుభాషిణి పద్య లక్షణములు
వృత్తం రకానికి చెందినది
అతిజగతి ఛందమునకు చెందిన 3052 వ వృత్తము.
13 అక్షరములు ఉండును.
17 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - I U I - I I I - I U I - U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు స , జ , న , జ , గ గణములుండును.