Tuesday, May 19, 2020

అల్లంకు వారికి వందనముల్

****************మధుమతి (స్వనకరీ)**************
మనసు మాటలతో 
తనువు చేతలతో 
కనుల చూపులతో 
అనుచు వ్రాయుదునే (1)

కలము కాగితమున్
మలచి మంత్రములన్
తలచి పద్యములన్
వలచి వ్రాయుదునే  (2)

మెరుగు మానసముల్ 
తరుగు తాపములున్ 
కరుగు ప్రాణములున్ 
తరిగి వ్రాయుదునే (3)

చదువు పుస్తకముల్ 
ఒదుగు నొజ్జలలా
కుదురు కల్గెదరే,
విధిగ  వ్రాయుదునే  (4)

ఒకశరత్తు, మీ 
రొకప్రియమ్మవుచున్
ఒకరి కొక్కరు చే 
రికయి, బంధువులౌ (5)

కలసి స్నేహితులై 
కలసి బంధువులై 
కలసి వేడుకులన్ 
కలసి నింపెదరున్  (6)

కలసి "నేహ"ను ధ్రువ్ 
వలచి పూర్వి "క్రిష"న్  
అలుపు రావనుచున్
కలసి పోయెదరే  (7)

కలసి ఆటలతో
కలసి మాటలతో 
కలసి వచ్చెరు, నే
కలగ వ్రాయుదునే  (8)

కలము చూడగనే 
విలువ చూడగనే 
కలువ రేకులలా 
మలచి వ్రాయుదునే (9)

తెలిపి వందనముల్ 
కలసి మాధవితో
తలచు కుందునులే 
తలచి తన్మయమున్ (10)
*******************************************
మధుమతి పద్య లక్షణములు
  • పద్య ఛందస్సుకే స్వనకరీ అనే ఇతర నామము కూడా కలదు.
  • వృత్తం రకానికి చెందినది
  • ఉష్ణిక్కు ఛందమునకు చెందిన 56  వృత్తము.
  • 7 అక్షరములు ఉండును.
  • 9 మాత్రలు ఉండును.
  • మాత్రా శ్రేణిI I I - U I I - U
  • 4 పాదములు ఉండును.
  • ప్రాస నియమం కలదు
  • ప్రతి పాదమునందు  , ,  గణములుండును.
మల్లేశ్వరరావు పొలిమేర 
05.19.2020

Thursday, May 7, 2020

నలభై వసంతాల పయణం

నలభై వసంతాల పయణం
నలుమూలలా పంచి చూపిన ప్రణయం 
నమ్మకంతో తోడుండు హృదయం 
నాలుగు అమావాస్యలు దాటగలిగే వినయం 

పున్నమి పౌర్ణమి వెలుగులతో 
కన్నకలల సాకారముతో 
మిన్నటి జీవితగమనముతో 
విన్నవించును మీ పుస్తక పఠనము 

లీలలు కలగలుపు అర్ధాంగి 
వీలుగ మలచగలుగు నాథుడు 
ఏలిన సంసార సాగరము 
ఆలనలో మీ సహగమనము 

ఆటుపోటుల నెదురించి 
చేటును దూరము నుంచి 
వాటాలకై ఆశించక 
తూటాలనే సంధించి 

కట్టుకున్న ఆ సుందర గృహము 
మట్టుకు మహా అంబురుహము
తట్టిన సరదాల సందర్శన
ఎట్టివారికైనా ఆదర్శణ 

అందుకోండి అభినందనలు 
ముందు తరాల వందనములు 
పొందులే కలగలుపి
అందరి శుభాభినందనలు

ఆలన = ఆలకించుట
అంబురుహము = పద్మము, నీతిలో పుట్టునది

ఇట్లు 
మాధవి - మల్లేశ్వర 
వెంకటేష్ - స్వాతి 
చెర్రీ - పూర్వి 
కింకు 

05/07/2020
మల్లేశ్వరరావు పొలిమేర 



Wednesday, May 6, 2020

మారిన లోకపు

మారిన లోకపు మంటల్లోనన్
కూరిన మానవ కోరల్లోనన్
చేరిన దీనటి జీవమ్ముల్లో
పేరుకు పోయెను భీతుల్, రాతల్ (1)

ప్రేమలు పంచిన పెండ్లాముల్లున్
ప్రేమలు పంచిన ప్రేయాంసుండుల్
ఓమటి నిచ్చెడు నుద్యోగాలన్
రామని యింటికి రాజేసుండ్రున్ (2)