నలభై వసంతాల పయణం
నలుమూలలా పంచి చూపిన ప్రణయం
నమ్మకంతో తోడుండు హృదయం
నాలుగు అమావాస్యలు దాటగలిగే వినయం
పున్నమి పౌర్ణమి వెలుగులతో
కన్నకలల సాకారముతో
మిన్నటి జీవితగమనముతో
విన్నవించును మీ పుస్తక పఠనము
లీలలు కలగలుపు అర్ధాంగి
వీలుగ మలచగలుగు నాథుడు
ఏలిన సంసార సాగరము
ఆలనలో మీ సహగమనము
ఆటుపోటుల నెదురించి
చేటును దూరము నుంచి
వాటాలకై ఆశించక
తూటాలనే సంధించి
కట్టుకున్న ఆ సుందర గృహము
మట్టుకు మహా అంబురుహము
తట్టిన సరదాల సందర్శన
ఎట్టివారికైనా ఆదర్శణ
అందుకోండి అభినందనలు
ముందు తరాల వందనములు
పొందులే కలగలుపి
అందరి శుభాభినందనలు
ఆలన = ఆలకించుట
అంబురుహము = పద్మము, నీతిలో పుట్టునది
ఇట్లు
మాధవి - మల్లేశ్వర
వెంకటేష్ - స్వాతి
చెర్రీ - పూర్వి
కింకు
05/07/2020
మల్లేశ్వరరావు పొలిమేర
No comments:
Post a Comment