Thursday, December 31, 2020

పూర్వి పుట్టిన రోజు

 గానముతోడు తోచు తను గాత్రపు మాలలు మాకు విందులౌ  

ఆనతిగాన వేకువను హాస్యముతో మదిలో కుదించుచున్ 

కూన తలంపు లందెలను కూర్చుచు ప్రేమములన్ని  ప్రాసలౌ 

కానన మా గృహమ్ము పతకమ్మున పుత్తడి బొమ్మ ఆయగా   (1)

చిన్నగ చిందులేయుచును చేతను కొయ్య పు బొమ్మలందు వీ 

లున్న  విధమ్ము లాడుచును లోగిలి కందము పూయుటందుకా 

కన్నటి తల్లిదండ్రులకు కారణ భాగ్యము దీర్చి ఆకశ

మ్మున్నటి  తారవై వెలిగి ముచ్చటి గొల్పును  పూర్వి మోదమున్ (2)

********************************************************************

ప్రతీ నూతన సంవత్సరము తోడుగా 

మా యింటి పండుగై 
మా యింటి మహాలక్ష్మియై 
చిట్టడగులు అందెల సవ్వడి కూర్చుటకై 
వచ్చెరా  మా బంగారు తల్లి 

ఆటలలో  అలజడి కూర్చి 
మాటలలో మంత్రములు కూర్చి 
పాటలలో ప్రాయము కూర్చి 
తేట తేట పలుకులు 
నేటి మాట వెలుగులు కూర్చి 
వచ్చెరా   మా బంగారు తల్లి   

మొదటి సంవత్సరపు  
ముచ్చటి గొలిపి 
రెండవ సంవత్సరపు 
నిండుతనము చిలికి 
మూడవ సంవత్సరపు 
ముద్దుల నొలికి 
నాలుగవ సంవత్సరపు 
నాట్యములను వెలికి
ఐదవ సంవత్సరపు 
అల్లరిని కలిపి 
వచ్చెరా   మా బంగారు తల్లి  

తల్లికి అపురూపముగా  
తండ్రికి అనురూపము గా 
సోదరునికి సమరూపముగా 
కలగలిపి 
ప్రేమకు ప్రతిరూపమై 
వచ్చెరా   మా బంగారు తల్లి

పుత్తడి బొమ్మ పుట్టిన రోజై 
అత్తరులన్ని దట్టుచు నేడు 
రెక్కల గుర్రపు సొగసులు పూసి 
వేడుక చేయగా
వచ్చెరా   మా బంగారు తల్లి 

అట్టి మా చిట్టి తల్లికి 
పుట్టిన రోజు శుభాకాంక్షలతో 

...... మాధవి మల్లేష్ మరియు ధృవ్ 
01.02.2021

Friday, December 25, 2020

Happy Christmas 2020

 Happy Christmas

****************************************
HO HO HO HO
All kids are around the tree
Fun with all the snow
Santa surprises are here, you see (1)
I know KINKU here
Come near to me sweetheart
What do you want for Christmas dear?
I wish you will get a new cart (2)
Stockings are full of gifts
Jingle bells, here and there
PURVI dances having shifts
Christmas carols everywhere (3)
What a planned eve DHRUV
Milk and crackers are for Santa!
What a thrilling moment for kids to prove
And Make it happy with Mama’s infanta (4)
****************************************
Malleswara Rao Polimera
12.25.2020









Monday, December 21, 2020

చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు

 చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు

**************

నాకు తోడౌ బంధము 

నన్నంటు బంధము

అన్న అన్న యని నా వెంటుండు బంధము 


మనసు మమత 

మంచి చెడ్డ 

మా చిన్ననాటి సంగతులు 

పంచుకున్న కాకి యంగిలి జంతుకులు


పండుగల కోలాహలం

నిండుకున్న ఆనందాలు 

అండదండలుగ అన్నతో సహవాసము


అమ్మానాన్నల జ్ఞాపకాలు

అమ్మమ్మ తాతయ్య ఆలాపనలు

ఊసులాడుకొని ఊయ్యాలాటలు


పయనమవుతు బడికి 

గౌరమ్మ గుడికి

కొత్తబట్టల కోలాహలము చిలికి

ముసిముసి నవ్వులు యొలికి


సమీక్షలలో కాలక్షేపము

పరీక్షలకై తర్జనభర్జనలు

శిక్షణలో తాతయ్య బోధనలు

నిరీక్షణతో మార్కుల లెక్కలు


తొక్కుడుబిల్లల ఆటలో యురుకు

వీరివీరి గుమ్మడిపండులో చురుకు

చింతపిక్కల ఆటలో తలుకు

వైకుంటపాళిలో మెలుకు 


ఆటలలో కలసి

మాటలలో తలచి

చేతలలో వలచి

మనసులో నిలచి


ముంగిట ముగ్గుల తోరణాలు 

రంగులతో నద్దిన పండుగలు 

అమ్మమ్మకు తోడుగు నుండి 

చెంగుమను తిరుగాడు సందడి 


మా ఇంటి వనితవై

ఓ ఇంటి ఇల్లాలివై

మంచికి మారుపేరుగ 

పంచిన ప్రేమగీతములు


తోడబుట్టిన నా చెల్లి

చూడచక్కని నా తల్లి

ఏడఉన్నను నా చెల్లి

వేడుకౌదునుగా మల్లి .....


పుట్టినరోజు శుభాకాంక్షలు 

**************

Thursday, December 17, 2020

To Dhruv Tatayya

 ******************************

Nothing will stop tears

when loved one touching heart 

Getting a letter from dears

Is an unforgettable moment not to fall-apart (1)


Fun-filled Grand Pa  to have

with heartful love and affection  

Dhruv is very lucky to have

such a wonderful personal action (2)


Thank You for your Birthday Note

Dhruv always reminds you more

Thank You for your Wish Note 

Dhruv always loves you more  (3)

***************************

Sunday, December 6, 2020

అమ్మాయి పుట్టుక - వెంకీ పాప

*********************************************** 

అమ్మాయి పుట్టుక అందాల తోరణం 

కమ్మగా మాయింట కళకళ తోరణం 

చెమ్మగిల్లిన కళ్ళల్లో ఆనంద తోరణం 

అమ్మ నాన్నల ఆశల హరివిల్లు తోరణం 


పిల్ల వచ్చెనోయ్ 

పిల్లా వారింట 

వెల్లు వెక్కెనోయ్ 

వెంకీ స్వాతింట 


అమ్మమ్మ తాతయ్య 

నాన్నమ్మ తాతయ్య 

అత్త మామామల నోట, 

అన్న అచ్చట ముచ్చట ,

బావ వదినల 

బుల్లి గడుగ్గాయల నోట, 

ఒకటే సందడి 

పండుగలో పందిరి


పలుకలో చెల్లెమ్మ 

కులుకలో చెల్లెమ్మ 

తళుకులో తారమ్మ 

చిలుకు బోసినవ్వమ్మా 


రావమ్మా లక్ష్మియై 

తేవమ్మా సంతసం 

పుడమిపై పూర్ణమ్మ 

పుత్తడి బొమ్మ నీవమ్మా 


కోటి ఆశల తీరమ్మై 

పుట్టినింటి ప్రేమగీతమ్ములు 

మెట్టినింటిలో సారమ్మై 

అట్టిపెట్టు ప్రేమగీతమ్ములు 


నీ రాక మార్పులే 

మాకెన్నో చేర్పులై 

నీ తీపి గుర్తులే 

మా ఇంట కూర్పులౌ 


నిండు నూరేళ్లు 

పండువెన్నెల పూసి 

మెండు జీవితమందు 

ఉండు నా తల్లి 

పుడమి నందు .... అందుకో మా శుభాశీసులు 

*********************************************** 

మల్లేశ్వరరావు పొలిమేర 

12/06/2020