Monday, December 21, 2020

చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు

 చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు

**************

నాకు తోడౌ బంధము 

నన్నంటు బంధము

అన్న అన్న యని నా వెంటుండు బంధము 


మనసు మమత 

మంచి చెడ్డ 

మా చిన్ననాటి సంగతులు 

పంచుకున్న కాకి యంగిలి జంతుకులు


పండుగల కోలాహలం

నిండుకున్న ఆనందాలు 

అండదండలుగ అన్నతో సహవాసము


అమ్మానాన్నల జ్ఞాపకాలు

అమ్మమ్మ తాతయ్య ఆలాపనలు

ఊసులాడుకొని ఊయ్యాలాటలు


పయనమవుతు బడికి 

గౌరమ్మ గుడికి

కొత్తబట్టల కోలాహలము చిలికి

ముసిముసి నవ్వులు యొలికి


సమీక్షలలో కాలక్షేపము

పరీక్షలకై తర్జనభర్జనలు

శిక్షణలో తాతయ్య బోధనలు

నిరీక్షణతో మార్కుల లెక్కలు


తొక్కుడుబిల్లల ఆటలో యురుకు

వీరివీరి గుమ్మడిపండులో చురుకు

చింతపిక్కల ఆటలో తలుకు

వైకుంటపాళిలో మెలుకు 


ఆటలలో కలసి

మాటలలో తలచి

చేతలలో వలచి

మనసులో నిలచి


ముంగిట ముగ్గుల తోరణాలు 

రంగులతో నద్దిన పండుగలు 

అమ్మమ్మకు తోడుగు నుండి 

చెంగుమను తిరుగాడు సందడి 


మా ఇంటి వనితవై

ఓ ఇంటి ఇల్లాలివై

మంచికి మారుపేరుగ 

పంచిన ప్రేమగీతములు


తోడబుట్టిన నా చెల్లి

చూడచక్కని నా తల్లి

ఏడఉన్నను నా చెల్లి

వేడుకౌదునుగా మల్లి .....


పుట్టినరోజు శుభాకాంక్షలు 

**************

No comments:

Post a Comment