Thursday, December 31, 2020

పూర్వి పుట్టిన రోజు

 గానముతోడు తోచు తను గాత్రపు మాలలు మాకు విందులౌ  

ఆనతిగాన వేకువను హాస్యముతో మదిలో కుదించుచున్ 

కూన తలంపు లందెలను కూర్చుచు ప్రేమములన్ని  ప్రాసలౌ 

కానన మా గృహమ్ము పతకమ్మున పుత్తడి బొమ్మ ఆయగా   (1)

చిన్నగ చిందులేయుచును చేతను కొయ్య పు బొమ్మలందు వీ 

లున్న  విధమ్ము లాడుచును లోగిలి కందము పూయుటందుకా 

కన్నటి తల్లిదండ్రులకు కారణ భాగ్యము దీర్చి ఆకశ

మ్మున్నటి  తారవై వెలిగి ముచ్చటి గొల్పును  పూర్వి మోదమున్ (2)

********************************************************************

ప్రతీ నూతన సంవత్సరము తోడుగా 

మా యింటి పండుగై 
మా యింటి మహాలక్ష్మియై 
చిట్టడగులు అందెల సవ్వడి కూర్చుటకై 
వచ్చెరా  మా బంగారు తల్లి 

ఆటలలో  అలజడి కూర్చి 
మాటలలో మంత్రములు కూర్చి 
పాటలలో ప్రాయము కూర్చి 
తేట తేట పలుకులు 
నేటి మాట వెలుగులు కూర్చి 
వచ్చెరా   మా బంగారు తల్లి   

మొదటి సంవత్సరపు  
ముచ్చటి గొలిపి 
రెండవ సంవత్సరపు 
నిండుతనము చిలికి 
మూడవ సంవత్సరపు 
ముద్దుల నొలికి 
నాలుగవ సంవత్సరపు 
నాట్యములను వెలికి
ఐదవ సంవత్సరపు 
అల్లరిని కలిపి 
వచ్చెరా   మా బంగారు తల్లి  

తల్లికి అపురూపముగా  
తండ్రికి అనురూపము గా 
సోదరునికి సమరూపముగా 
కలగలిపి 
ప్రేమకు ప్రతిరూపమై 
వచ్చెరా   మా బంగారు తల్లి

పుత్తడి బొమ్మ పుట్టిన రోజై 
అత్తరులన్ని దట్టుచు నేడు 
రెక్కల గుర్రపు సొగసులు పూసి 
వేడుక చేయగా
వచ్చెరా   మా బంగారు తల్లి 

అట్టి మా చిట్టి తల్లికి 
పుట్టిన రోజు శుభాకాంక్షలతో 

...... మాధవి మల్లేష్ మరియు ధృవ్ 
01.02.2021

No comments:

Post a Comment