Wednesday, June 14, 2023

ఆశ

సుధగారి కథకు పద్యపు స్వేచ్ఛానువాదము 

తే.గీ. 
ఏమి నాశించకుండుట నిచ్చు మనకు 
చాలినంతటి తృప్తిని వీలుజూపి
కొంచెముంచిన నాశలో కోరవచ్చి

పొందరాకున్న ప్రతిసారి చింత గలుగు! -1 


ఆ.వె. 

చదువుచున్న దిట్లు మధురిమ మంచివౌ

మాటలన్ని నవ్వుకుంటు తాను!

ఆశ పడక నున్న శ్వాసలో మౌనమ్ము

జీవితమ్ము కాదు, భువిననుకొనె! -2


ఆ.వె. 

ఎట్టి వారికైన నెనలేని కోరికల్

ఎట్టి దశనునైన పుట్ట గలవు 

ఇట్టి భావమందు గట్టిగా నమ్మిన

పెట్టిపుట్టినపుడు విడవటేల!-3


తే.గీ. 

ఓపికయు, డబ్బు కలిగి నారోగ్యమున్న

ఆశ పడుట సహజమౌచు అందిపుచ్చు

తాను నమ్మిన వాదన తలచు నెపుడు 

మనసు కోరిన చాలుగా వనిత యందు-4


మత్తకోకిల.

బాల్యమందున చూడముచ్చటి పల్లెసీమలు చుట్టుచున్

లౌల్యమందు విహారయాత్రల లాలిపాటలు పాడుచున్    

తుల్యమౌచును తల్లిదండ్రులు తోచినంతన చూపగా

బాల్యజీవిత శోభలెన్నని పంచుకుండుచు నాత్రమున్! - 5

లౌల్యము = ఆశ 


తే.గీ. 

తనకు నూతన దేశములనిన ప్రీతి 

కనుక నెక్కడ జెప్పిన వినుచునుండె 

ఆదివారపు పత్రిక చదువుకొనుచు  

జూడు, ననుబంధ శీర్షిక వీడకుండ - 6 



Tuesday, June 6, 2023

పితృ దినోత్సవం - లయగ్రాహి

 

లయగ్రాహి

అమ్మవెనుకుండుఁ దనునమ్మికపు ప్రేమఁ దనుచెమ్మఁజెమటల్ విడిచి రొమ్మువిరబూయున్

సొమ్ములనుఁ గూడ్చిఁ దనుదమ్ము రుచుజూపుఁ దనువమ్మవని వారథిని రమ్మనుచునుండెన్

తిమ్మురనిఁ దిట్టుఁ దనులెమ్ము యని నొడ్డుఁ దనుచెమ్మలనుఁ గంటియెడఁ జిమ్మనిది "నాన్నై


"అమ్మయనిఁ బుత్రికను, "కొమ్మయనిఁ బుత్రుడినినెమ్మికలుఁ బంచు తనుఁ గమ్మటి గృహమ్మున్!


కొప్పరపు సోదరకవులు నల్లి

మల్లెలును మొల్లలును జల్లినను శయ్యపయి నల్లియొకఁడుండ సుఖమెల్లయును బాడం

చెల్లరు వచింతు రటు లెల్లిదము సేయఁదగ    దల్ల కుసుమాంబకుని భల్ల మదియందున్

వల్లభుఁడు కాంత ముదమల్లుకొన సెజ్జఁగనఁ  బెల్లెగసి నిద్ర తనువెల్ల మఱపింపన్

ఝల్లుమనఁగుట్టి రతి నుల్లములు దన్పి భళి  వల్లెయని వారి నుతులల్లపుడే గంటన్


లయగ్రాహి పద్య లక్షణములు

  1. వృత్తం రకానికి చెందినది
  2. ఉద్ధురమాల ఛందమునకు చెందిన 250539759 వ వృత్తము.
  3. 30 అక్షరములు ఉండును.
  4. 39 మాత్రలు ఉండును.
  5. మాత్రా శ్రేణిU I I - I U I - I I U - I I I - U I I - I U I - I I U - I I I - U I I - I U U
    • పంచమాత్రా శ్రేణి: U I I I - U I I I - U I I I - U I I I - U I I I - U I I I - U I I I - U U
  6. 4 పాదములు ఉండును.
  7. ప్రాస నియమం కలదు
  8. ప్రాస యతి నియమం కలదు
  9. ప్రతి పాదమునందు 9,17,25 వ అక్షరములు యతి స్థానములు
  10. ప్రతి పాదమునందు భ , జ , స , న , భ , జ , స , న , భ , య గణములుండును.

అమ్మవెనుకుండు తను, నమ్మికపు ప్రేమ తను, చెమ్మఁజెమటల్ విడిచి రొమ్మువిరబూయున్

సొమ్ములను గూడ్చి తను, దమ్ము రుచుజూపు తను, వమ్మవని వారథిని రమ్మనుచునుండెన్

తిమ్మురని తిట్టు తను, లెమ్ము యని నొడ్డు తను, చెమ్మలను గంటియెడ జిమ్మనిది "నాన్నై" 

"అమ్మ" యని పుత్రికను, "కొమ్మ" యని పుత్రుడిని, నెమ్మికలు పంచు తను కమ్మటి గృహమ్మున్