లయగ్రాహి
అమ్మవెనుకుండుఁ దను, నమ్మికపు ప్రేమఁ దను, చెమ్మఁజెమటల్ విడిచి రొమ్మువిరబూయున్
సొమ్ములనుఁ గూడ్చిఁ దను, దమ్ము రుచుజూపుఁ దను, వమ్మవని వారథిని రమ్మనుచునుండెన్
తిమ్మురనిఁ దిట్టుఁ దను, లెమ్ము యని నొడ్డుఁ దను, చెమ్మలనుఁ గంటియెడఁ జిమ్మనిది "నాన్నై"
"అమ్మ" యనిఁ బుత్రికను, "కొమ్మ" యనిఁ బుత్రుడిని, నెమ్మికలుఁ బంచు తనుఁ గమ్మటి గృహమ్మున్!
కొప్పరపు సోదరకవులు నల్లి
మల్లెలును మొల్లలును జల్లినను శయ్యపయి నల్లియొకఁడుండ సుఖమెల్లయును బాడం
చెల్లరు వచింతు రటు లెల్లిదము సేయఁదగ దల్ల కుసుమాంబకుని భల్ల మదియందున్
వల్లభుఁడు కాంత ముదమల్లుకొన సెజ్జఁగనఁ బెల్లెగసి నిద్ర తనువెల్ల మఱపింపన్
ఝల్లుమనఁగుట్టి రతి నుల్లములు దన్పి భళి వల్లెయని వారి నుతులల్లపుడే గంటన్
లయగ్రాహి పద్య లక్షణములు
- వృత్తం రకానికి చెందినది
- ఉద్ధురమాల ఛందమునకు చెందిన 250539759 వ వృత్తము.
- 30 అక్షరములు ఉండును.
- 39 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: U I I - I U I - I I U - I I I - U I I - I U I - I I U - I I I - U I I - I U U
- పంచమాత్రా శ్రేణి: U I I I - U I I I - U I I I - U I I I - U I I I - U I I I - U I I I - U U
- 4 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- ప్రాస యతి నియమం కలదు
- ప్రతి పాదమునందు 9,17,25 వ అక్షరములు యతి స్థానములు
- ప్రతి పాదమునందు భ , జ , స , న , భ , జ , స , న , భ , య గణములుండును.
అమ్మవెనుకుండు తను, నమ్మికపు ప్రేమ తను, చెమ్మఁజెమటల్ విడిచి రొమ్మువిరబూయున్
సొమ్ములను గూడ్చి తను, దమ్ము రుచుజూపు తను, వమ్మవని వారథిని రమ్మనుచునుండెన్
తిమ్మురని తిట్టు తను, లెమ్ము యని నొడ్డు తను, చెమ్మలను గంటియెడ జిమ్మనిది "నాన్నై"
"అమ్మ" యని పుత్రికను, "కొమ్మ" యని పుత్రుడిని, నెమ్మికలు పంచు తను కమ్మటి గృహమ్మున్
No comments:
Post a Comment