తెలుగు వాడి ననుచు పలుకరా ఈరోజు
తెలుగు భాషనుండు తియ్యదనము
తెలుగు నేర్పి జూపి తెలుపరా, నీ విధి
తెలుగు జాతి కొరకు వెలుగు నిలిపి (1)
తాతదండ్రులందు దాగిన సొత్తురా
అమ్మ బామ్మలందు నాత్మ కలిగి,
భాషలోని తలపు భవితలో జూపుచు
బాధ్యతయని తెలిసి పంచు కొనుము (2)
నెల్లలోకమందు నెందు కాలెడి యున్న
తెలుగు వారి సొత్తు తెనుగు వ్యాప్తి,
కెల్లరందు నున్న పిల్లలందరు నేడు
తెలుగు నేర్చినంత కలుగు తృప్తి! (3)
No comments:
Post a Comment