హృదయము నిలుచు స - హృదయ మాతా మమతను దెలుపు స - మతగ మాతా కలమును గదుపు స - కలము మాతా ఫలముగ నిడుము స - ఫలము మాతా ! అయ్యో గౌరీమాతను "గౌరి"లో కొలుచుదామని అనుకొని...ప్రాస... తప్పు తప్పు ... *****************గౌరి ********************** శివునికి సగమవు - చెలివి గౌరీ దివిని సురలయెడ - దిశవు గౌరీ అవనికి ప్రియమగు - నమవు గౌరీ కవనము నొసగెద - కరుణ గౌరీ! (1) పలికెద పదమున - ప్రతి దినమ్మున్ తలఁచెద తరగని - దగు తపమ్మున్ మలిచెద మనసును - మరి గతమ్మున్ కొలిచెద మమతల - గుడిని, గౌరీ! (2) *************************************** అమ = అమ్మ గౌరి పద్య లక్షణములు అతిజగతి ఛందమునకు చెందిన 2048 వ వృత్తము. 13 అక్షరములు ఉండును. 15 మాత్రలు ఉండును. మాత్రా శ్రేణి: I I I - I I I - I I I - I I U - U 4 పాదములు ఉండును. ప్రాస నియమం కలదు ప్రతి పాదమునందు న , న , న , స , గ గణములుండును.
శ్లోకం: केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला न स्रानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः I वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्तेखिल भूषणानि सततं वाग्भूषणं भूषणम् II भर्तृहरि नीतिशतकम् । శ్లోకం: కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః । వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥ భర్తృహరి నీతిశతకం – విద్వత్పద్ధతి పై శ్లోకములోని నాలుగవ పాదానికి పాఠాంతరం: క్షీయన్తే ఖలు భూషణాని, సతతం, వాగ్భూషణం భూషణం పద విభాగం: కేయూరాణి, న భూషయన్తి, పురుషం, హారాః, న, చన్ద్రోజ్జ్వలాః, న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలఙ్కృతాః, మూర్ధజాః, వాణీ, ఏకా, సమలఙ్...
Comments
Post a Comment