Monday, May 1, 2017

నమన

నమన -
మే ఒకటవ తారీకును మేడే అంటారు. కష్టములో ఉండే వారు సహాయానికి కూడ మేడే,
మేడే అని ఆపదను సూచించే రేడియో సందేశమును పంపుతారు ఈ మేడే అనే పదము ఫ్రెంచిలోని m'aidez నుండి వచ్చినది.
నాకు సహాయము చేయమని అర్థము. దీనినే SOS అని కూడ అంటారు.
SOS కు మూడు dit, మూడూ dah, మళ్లీ మూడు dit. dit కొంచెము కాలము ధ్వనించే శబ్దము,
dah దీర్ఘ కాలము ధ్వనించే శబ్దము. dit లఘువు,
dah గురువు. SOS అప్పుడు III UUU III అవుతుంది,
అనగా న/మ/న గణములు. క్రింద సార్థకనామ గణాక్షర వృత్తము "నమన"కు నా ఉదాహరణములు -
నమన - న/మ/న IIIU UU III లేక III UU UIII
9 బృహతి 456
నమన మైతిన్ నేనిపుడు
గమన మార్గం బాతనిది
సుమము లెల్లన్ బూజలకు
నమల మయ్యెన్ మానసము

మనసులో నెప్డున్ దలఁపు
స్వనములో నెల్లన్ వలపు
తనువులో వంపుల్ బిలుపు
దినములో దివ్వెల్ వెలుఁగు

హృదయమా వద్దే వలపు
వ్యధలతో వద్దే కలపు
ముదము నీయండే యతఁడు
వదలు నీకేలా వగపు

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
నా ప్రయత్నము
మరువలేకన్ బంధములు
తిరుగుతుండెన్ బాధ్యతగ
పరుగులెట్టెన్ కాలమున
బరువులెక్కెన్ గుండియను ...

No comments:

Post a Comment