మాతృదినోత్సవము...
సీ. ప్రాంతాలు వేరైన పడికట్లు వేరైన
పుట్టుకనిచ్చెడు పుణ్యమూర్తి
భాషలు వేరైన భావాలు వేరైన
పసికందు పాలిట పరమ పదము
జాతులు వేరైన చేతలు వేరైన
నిత్యము నీతోడు నిలుచు నమ్మ
పండగ లెన్నున్న పగవారి వైనను
మాతను కొలుచు నీ మంచి రోజు
తే.గీ. ఒక దినము లేక పదివేలె యున్నను మది
తలచు నా త్యాగజీవికై, తగవులేల?
చేయకుండుటనింగమ్ము చెంత నుంచి
నచ్చి, కొలుచు వారందఱిన్ మెచ్చు కొనుము
మొదటి ప్రతి ..
సీ. ప్రాంతాలు వేరైన పడికట్లు వేరైన
పుట్టుకనిచ్చేటి పుణ్యమూర్తి
భాషలు వేరైన భావాలు వేరైన
పసికందు పాలిట పరమ పదము
జాతులు వేరైన చేతలు వేరైన
నిత్యము నీతోడు నిలుచు నమ్మ
పండగ లెన్నున్న పగవారి వైనను
అమ్మను గుర్తించు కమ్మ రోజు
తే.గీ. ఒకటి యున్నను పదివేలు యున్నను మది
తలచు నా త్యాగజీవికై, తగువులేల?
చేయు, చేయకుండుటలు నీ చేత నుంచి
నచ్చి కొలువు వారందర్ని మెచ్చు కొనుము
సీ. ప్రాంతాలు వేరైన పడికట్లు వేరైన
పుట్టుకనిచ్చెడు పుణ్యమూర్తి
భాషలు వేరైన భావాలు వేరైన
పసికందు పాలిట పరమ పదము
జాతులు వేరైన చేతలు వేరైన
నిత్యము నీతోడు నిలుచు నమ్మ
పండగ లెన్నున్న పగవారి వైనను
మాతను కొలుచు నీ మంచి రోజు
తే.గీ. ఒక దినము లేక పదివేలె యున్నను మది
తలచు నా త్యాగజీవికై, తగవులేల?
చేయకుండుటనింగమ్ము చెంత నుంచి
నచ్చి, కొలుచు వారందఱిన్ మెచ్చు కొనుము
మొదటి ప్రతి ..
సీ. ప్రాంతాలు వేరైన పడికట్లు వేరైన
పుట్టుకనిచ్చేటి పుణ్యమూర్తి
భాషలు వేరైన భావాలు వేరైన
పసికందు పాలిట పరమ పదము
జాతులు వేరైన చేతలు వేరైన
నిత్యము నీతోడు నిలుచు నమ్మ
పండగ లెన్నున్న పగవారి వైనను
అమ్మను గుర్తించు కమ్మ రోజు
తే.గీ. ఒకటి యున్నను పదివేలు యున్నను మది
తలచు నా త్యాగజీవికై, తగువులేల?
చేయు, చేయకుండుటలు నీ చేత నుంచి
నచ్చి కొలువు వారందర్ని మెచ్చు కొనుము
No comments:
Post a Comment