Friday, January 26, 2018

భరతవర్షమ్ము - గణతంత్ర దినం

భరతవర్షమ్ము - గణతంత్ర దినం - శుభాకాంక్షలు 01/26/2018
***************వసుధ (కిసలయ , తిలకా)********************
అప్పుడు(A) _________________ ఇప్పుడు(B)
*****************************************************************
భరతమ్మెపుడో
సిరులున్నవనిన్
హరియించుటకై
పరులొచ్చెనురా (1A)
___________________భరతమ్మిపుడున్
___________________సిరులెంచుటకున్
___________________హరియించుటకై
___________________సరిసాటయరా (1B)
ఒడిలో మమతల్
బడిలో పథముల్
గుడిలో విధముల్
తుడిచెన్ నడకల్ (2A)
___________________ఒడిసెన్ పదవుల్
___________________బడిలో ధనముల్
___________________గుడిలో భయముల్
___________________తుడిచెన్ నడకల్ (2B)
ఎవరో వలచెన్
సవితై పొడిచెన్
సువిశాలమనిన్
భవితన్ కుదిపెన్ (3A)
___________________ఇవిగో యనుచున్
___________________అవినీతిపరుల్
___________________చవిచూచెనురా,
___________________భవితన్ వదిలెన్ (3B)
ఎదురించుటకై
విధిగా బిరుదుల్
కదిలొచ్చెనుగా
పదులై పథమున్ (4A)
___________________ఎదురించుటతో
___________________విధిరాతలనే
___________________కదుపున్ కదరా,
___________________వదిలుండుటయా? (4B)
మనమున్ దృఢమున్
పనిగా వడిగా
తన గొంతులతో
వినిపెంచెనురా (5A)
___________________మనలో మనమే
___________________గణతంత్రముతో
___________________కనిపెట్టుట కీ
___________________దినమొచ్చెనురా (5B)
_________మనమందరమున్
_________మన ధ్యేయముగా
_________మన సంస్కృతితో
_________మన మేలెదమున్ (6)
***********************************************************
బిరుదు = శూరుఁడు.
మనము = మది
పథము = మార్గము
వసుధ (కిసలయ , తిలకా)
వృత్తం రకానికి చెందినది
గాయత్రి ఛందమునకు చెందిన 28 వ వృత్తము.
6 అక్షరములు ఉండును.
మాత్రా శ్రేణి: I I U - I I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు స , స గణములుండును.


Monday, January 22, 2018

"ప ల్లమ్ము రా జు"

మా పాఠశాల మిత్రుల సమ్మేళనము జరిగి గురువులను సత్కరించిన కొద్ది దినములలో ఒకరైన "పల్లం రాజు గారు" పరమపదించారని విని వ్రాసినవి. మా చిన్నప్పుడు చాలా చుఱుకుగా మాతో ఉండేవారు.
*************************************************************
కం. కల్లకి వెలుగుల నిచ్చెను
చల్లని గురువులను గాంచి సంతోషమ్మున్
అల్లది మరవక ముందుర
"పల్లము రాజయ్య లేరు" బల్కులు వినెరా! (1)
కం. పమ్మిన నివాళి నే ను
ల్లమ్ము తెలుపుచుంటి చదువుల గురువుకిటు , వా
రామ్మముకు జుఱుకుదనము, రు
జుమ్ముల నెఱిగించి వీడె, శోకము నందున్ (2)
మొదటి అక్షరములు "ప ల్లమ్ము రా జు"
*************************************************************
పమ్ము,పమ్మిన= అతిశయించు
ఉల్లము =హృదయము
ఆమ్మ = ప్రఖ్యాతము (ఉర్దూ-తెలుగు నిఘంటువు)
రుజుము = అభివృద్ధి

Friday, January 19, 2018

ప్రసూనం ఇంటి పని

ఇంటి పని:
1. క్రింద పద్యములో పదములు ఎన్ని?
2. క్రింద పద్యములో ఎన్ని వాక్యములు ఉన్నవి?
3. క్రింద పద్యము చూసి వ్రాయండి.
4. క్రింద పద్యములో ప్రశ్నలకు జవాబులు పక్కన వ్రాయండి.

తేటగీతి:
******************************
"కవిత పాటను పాడింది", కర్త యేమి?
"శర్మ ఆటలు నాడెను", కర్మ  యేమి?
"ప్రియ మనబడిలో జేరింది", క్రియను తెలుపు?
"తేటగీతిని నీవు చదివెను, బాల".
******************************

Thursday, January 18, 2018

వసుమతి - శ్రీ గౌరి

**************వసుమతి**********
శ్రీ గౌరి గుడిలో
నే గంట శృతినై 
రాగాల ధ్వనిలో
దాగున్న మదితో (1)
నా పద్య పదముల్
ఆ పార్వ తమతో
నే పంచుకొనగా
నా పల్కు లివియే (2)
"నీ ముందు బుడమిన్
నా మేను మొదలై
నీ మీద బగితిన్
నా మేను కొసఁగెన్ (3)
నీ ప్రాంగణములో
నే ప్రాఁకు దినముల్
నీ ప్రార్థనలతో
నా ప్రాయమెదిగెన్  (4)
ఈశుండు కళతో
ఆ శాంకరునితో
ఆశాజనకమున్
నీ శక్తి దెలిసెన్  (5)
నీ పాట స్వరముల్
నా పొద్దుపొడుపున్
లేపంగ మొదలౌ
నా పుణ్యఫలమై  (5)
అందాల పురమున్
బంధాల ముడితో
గంధాల పసిలో
సంధించితినిగా  (6)
ఏ పూర్వ పునెమున్
ఏ పాటి వరమున్
నీ పంచ బతుకున్
నే పొందెనిటులన్"   (7)
************************
మేను1 =జన్మము,మేను2=శరీరము
శాంకరుఁడు = వినాయకుడు

వసుమతి
వృత్తం రకానికి చెందినది
గాయత్రి ఛందమునకు చెందిన 29 వ వృత్తము.
6 అక్షరములు ఉండును.
9 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U U I - I I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు త , స గణములుండును.

Monday, January 15, 2018

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి శుభాకాంక్షలు
***************************************
సీ. భోగము బొందిన యోగులకిడు బరి
పూర్ణ సంతోషమున్ భోగిరోజు
సంక్రమించెడు రాశి చలితోడ నెదురైన
భోగి మంటలలోన బ్రొద్దు పొడుచు
సంక్రాంతి శోభతో సరదాల ముచ్చట్లు
కనువిందు నిచ్చెగ కనుమ రోజు
ఆటపాటలతోడ హరిదాసు గానాలు
గాలిపటాలతో కలుగు బ్రీతి
తే.గీ. రంగవల్లులు నిండిన గ్రాంతిలోన
పిండివంటలు మరికొన్ని వండు కొనుచు
బంధుమిత్రులతో గూడి పండుగంత
జరుపుకొనుదురు మీర నాశపడు, మల్లి!
*******************************************

Wednesday, January 3, 2018

పూర్వి రెండవ పుట్టిన రోజు

మా అమ్మాయి (పూర్వి) రెండవ పుట్టిన రోజు ...01-02-2018
***********************************************************
ఆ.వె. అమ్మ కన్న కలల బొమ్మవై మా యింట
నాన్న చెంత జేరి నవ్వు బంచి,
అన్నతోడు ననుచు వన్నెలు బూయించి
పూర్వి తల్లి వీవు పుట్టి నావు ! (1)
తే.గీ. రెండు వత్సరముల ముందు ప్రేమ తోడ
పండు వెన్నెల కాంతితో బ్రజ్వలించి
నిండు చందమామను బోలి నిత్యమౌచు
నండ జేరి, నా పూర్విగా నల్లినావె! (2)
కం. నట్టింట జుట్టు పట్టివి,
పట్టెల పాదాలతోడ బట్టుకొలుపుచున్‌
బట్టుచు నాన్న, ననల తల
మొట్టెడు నల్లరివి పూర్వి, ముద్దుల బాలా ! (3)
పట్టుకొలుపు = ఆపు, అన = అన్న
చం. ఎదురుగ నిన్ను గాంచగను నెచ్చట బంధము వాలి పొంగెనో
నిదురను దూరముంచి మది నీదు తలంపులనెంచి ప్రేమతో
బదములు జారి భావనగ బద్యములందున బొంగి పొర్లగా
జదువుకు నేడు గాననగు సార్థకమియ్యది , నీదు/పూర్వి పుణ్యమై! (4)
వ: ఏమి చేసాము ..
ఉ. పుట్టిన రోజు పండుగని పూర్వికి నచ్చిన గొన్ని జంతువుల్
అట్టలతోటి చేయగను, నావును బందిని, నేర్పు జూపుచున్
బట్టగ నన్న ధృవ్, తనకు బాఁతవి గుర్తుకు వచ్చి తోడుగా
నిట్టుల సంబరమ్ములను నిచ్చెను మాధవితోడ హాయిగా! (5)
***********************************************************


Tuesday, January 2, 2018

Happy New Year

trying, some mistakes there
***************************************
thEtaGIti
Every second you spend, Today memory for you
Every year show ups and many low times Bro
Every difficulty has a fix, You can do
Every attempt you try, Teach new things, become  Pro
wish you new year dear, Will Pry, Wish you this day.
******************************************
తే.గీ.
ఎవ్విరి సెకండ్ యు స్పెండ్, టు డె మెమరి ఫర్ యు
ఎవ్విరి యియర్ షొ అప్సన్డ్ మెనీ లొ టైమ్స్ బ్రొ
ఎవ్విరి డిఫికల్టీ హస్ ఎ ఫిక్స్, యు కెన్ డు
ఎవ్విరి ఎటెంప్ట్ యు ట్రై, టీచ్ న్యు తింగ్స్, బెకమ్ ప్రొ
విష్ యు న్యు యియర్ డియర్, విల్ ప్రె, విష్ యు దిస్ డె.
******************************************