Wednesday, January 3, 2018

పూర్వి రెండవ పుట్టిన రోజు

మా అమ్మాయి (పూర్వి) రెండవ పుట్టిన రోజు ...01-02-2018
***********************************************************
ఆ.వె. అమ్మ కన్న కలల బొమ్మవై మా యింట
నాన్న చెంత జేరి నవ్వు బంచి,
అన్నతోడు ననుచు వన్నెలు బూయించి
పూర్వి తల్లి వీవు పుట్టి నావు ! (1)
తే.గీ. రెండు వత్సరముల ముందు ప్రేమ తోడ
పండు వెన్నెల కాంతితో బ్రజ్వలించి
నిండు చందమామను బోలి నిత్యమౌచు
నండ జేరి, నా పూర్విగా నల్లినావె! (2)
కం. నట్టింట జుట్టు పట్టివి,
పట్టెల పాదాలతోడ బట్టుకొలుపుచున్‌
బట్టుచు నాన్న, ననల తల
మొట్టెడు నల్లరివి పూర్వి, ముద్దుల బాలా ! (3)
పట్టుకొలుపు = ఆపు, అన = అన్న
చం. ఎదురుగ నిన్ను గాంచగను నెచ్చట బంధము వాలి పొంగెనో
నిదురను దూరముంచి మది నీదు తలంపులనెంచి ప్రేమతో
బదములు జారి భావనగ బద్యములందున బొంగి పొర్లగా
జదువుకు నేడు గాననగు సార్థకమియ్యది , నీదు/పూర్వి పుణ్యమై! (4)
వ: ఏమి చేసాము ..
ఉ. పుట్టిన రోజు పండుగని పూర్వికి నచ్చిన గొన్ని జంతువుల్
అట్టలతోటి చేయగను, నావును బందిని, నేర్పు జూపుచున్
బట్టగ నన్న ధృవ్, తనకు బాఁతవి గుర్తుకు వచ్చి తోడుగా
నిట్టుల సంబరమ్ములను నిచ్చెను మాధవితోడ హాయిగా! (5)
***********************************************************


No comments:

Post a Comment