Thursday, September 19, 2019

రాఖి పండుగ

రాఖి పండుగనాటి సీసము
***********************************
పుట్టింటి పుత్తడి బొమ్మకుఁ దోడుగా
గట్టుబడు నదియె కన్న ప్రేమ
చెల్లినిఁ గాచుచు జేదోడు వాదోడు
నంటిపెట్టునదియె యవనిఁ బ్రేమ
ఆటపాటలయందు నాప్యాయతలుఁ బంచి
యంగరక్షకుఁడాయె నగ్రజుండు
వలపులు బంచుచు గలఁతలు వీడుచు
నాశీర్వదించెడి యన్న ప్రేమ
తేటగీతి
రక్ష నేనంటు బంధమ్ము లాగి కట్టి
సాక్షి యదియంటు సహృదయ సమయమిచ్చి
తల్లిదండ్రులఁ గనులార ధన్యతెంచి
పూర్వి ధ్రువులతో పొదరిల్లు/ పొలిమేర పొందు లివియె !
**********************************************

Friday, August 23, 2019

మనబడి

తెలుగు బడి(మనబడి)లో జేర్పించి పిల్లలకు తెలుగు వెలుగులు పంచండి.
****************************ద్విరదగతి రగడ*****************************
వచ్చినది తెలుగుబడి వచ్చినది మనబడియె
వచ్చినది వచ్చినది వత్సరపు మనబడియె
తెచ్చినది తెలుగుబడి తెలుగువారికి గుడియె
తెచ్చినది తెచ్చినది దివ్యమగు నది గుడియె
మెచ్చినది మనభాష మిళితమౌచు తోడయె
మెచ్చినది మెచ్చినది మేలిమౌచు తోడయె (1)
చేకూర్చు "బాలబడి" చిలిపిగా మాటలను
చేకూర్చు "ప్రవేశము" చిన్నారి పాటలను
చేకూర్చు "ప్రసూనము" చెప్పదగు నీతులను
చేకూర్చు "ప్రకాశము" శ్రేష్ఠమగు గాథలను
చేకూర్చు "ప్రమోదము" చిత్రమయిన కృతులను
చేకూర్చు "ప్రభాసము" శ్రేయమగు తెలుగులను (2)
తెలుగులో వెలుగులున్ తెలుపుచున్ సాగంగ
పలుకులో స్పష్టతల్ పరవళ్లు తొక్కంగ
పలుకుచున్ మన నీతి పద్యాలు పాడంగ
మెళుకువల నెన్నియో కలబోసి నేర్పంగ
నలుగురికి నడకలో నాణ్యతల్ నింపంగ
కలుపురా! మనభాష పిలుపదియె ధ్యేయముగ (3)
*********************************************************
ద్విరదగతి రగడ పద్య లక్షణములు
జాతి(రగడలు) రకానికి చెందినది
12 నుండి 20 అక్షరములు ఉండును.
2 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
అంత్య ప్రాస నియమం కలదు
ప్రాస యతి నియమం కలదు
ప్రతి పాదమునందు 3 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు నాలుగు 5 మాత్రలు గణములుండును.
మల్లేశ్వరరావు పొలిమేర
08.23.2019

Sunday, August 4, 2019

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
******************నారాయణ*******************
స్నేహమే నా తోడు నౌచు
మోహమే తా జోడు లేక
సాహసమ్ముల్ సాటి యంచు 
దోహదమ్ముల్ చేయ బూనె (1)

చిన్న నాడా చిట్టి ప్రేమ
కన్న నాడా గట్టి ప్రేమ
ఎన్నలేదే యెట్టి ప్రేమ
మిన్నగాదా! మేలు జేసి (2) 

పల్లెటూర్లో బోసి నవ్వు
కల్లబొల్లే మాట లేక
అల్లుకుంటూ చేల చుట్టు
వెల్లువైనా చిట్టి కూర్మి (3)

ఆటపాటల్ అంటి జూపి
తోటివారిన్ తొంగి జూపి
చేటుజేసే యూసు లేక
మేటి బంధంమ్మౌను మైత్రి (4)

ఆ కళాశాలన్ మిగిల్చె
ఆకళించే మంత్రమేదొ
తోకచుక్కల్ జారునట్టి
షోకులిచ్చా హక్కు జూపె  (5)

ఏడుఏడూ ఎట్టి రూపు
తోడువచ్చే నిత్య రూపు
మోడువారే వారి చెంత
దౌడులాగా చేరు కొందు  (6)

నాకు ఇచ్చే ఇట్టి చింత
నాకు ఇచ్చే స్నేహితుళ్లు
నాకు నచ్చేవారు వారు
నాకు మెచ్చేవారు వారు  (7)
*************************************

నారాయణ పద్య లక్షణములు
వృత్తం రకానికి చెందినది
అనుష్టుప్పు ఛందమునకు చెందిన 163 వ వృత్తము.
8 అక్షరములు ఉండును.
13 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I U - U U I - U I
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు ర , త , హ(గల) గణములుండును.

మల్లేశ్వరరావు పొలిమేర
08/04/2019





Saturday, July 13, 2019

శ్రీగౌరిని దలచక...

శ్రీగౌరిని దలచక...

*******************కందం************************
శ్రీగౌరిని దలచక నే
నే గేయము పాడగలిగి, ఇచ్చను తెలిపే
రాగాల నాలపించక
సాగేటి దినములు జూసి సాగుట యెటులో (1)

పల్లెను మాత్రము కనబడు
ఉల్లము లోతట్టు భక్తి యుక్తుల నెన్నో
అల్లందు పురపు పరుగున
చెల్లదు, విడివడు విధములు చెప్పుము తల్లీ ! (2)

ఏమమ్మా! నీ జాతర
లేమియు కనబడు ఘడియలు ఎప్పటి మాటో!
ప్రేమగ నీకై రచనలు
నీమముగ విడిచిన నాకు నిక్కము గాదా ! (3)

నా దేశము నా రాష్ట్రము
నా దేవత నా పురములు నా మది నుండెన్
నీ దయయును నీ దక్షత
నీ దాసుని నెమ్మి నుంచి నిత్యము తోడౌ! (4)

అమ్మల గన్నటి యమ్మగ
నమ్మిన భక్తి కిడి శక్తి నలుదిక్కులలో
అమ్మకు దూరము నున్నను
కమ్మని కార్యములతోడ కాచుము తల్లీ ! (5)

*******************************************

కందం పద్య లక్షణములు:
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
రెండవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
నాలుగవ పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
ఒకటవ పాదమునందు మూడు 4 మాత్రల గణములుండును.
రెండవ పాదమునందు ఐదు 4 మాత్రల గణములుండును.
మూడవ పాదమునందు మూడు 4 మాత్రల గణములుండును.
నాలుగవ పాదమునందు ఐదు 4 మాత్రల గణములుండును.
6వ గణము నల లేదా జ కావలెను.
చివరి అక్షరం గురువు కావలెను.
బేసి గణం జ కూడదు


మల్లేశ్వరరావు పొలిమేర
07.12.2019

Wednesday, June 19, 2019

Happy Fathers Day

కొంచెం ఆలస్యముగానైనా అందరి తండ్రులకు పితృదినోత్సవ శుభాకాంక్షలు .
Happy Fathers Day
********************గణనాథ************************
అన్నియును తానై యాశలనుఁ దీర్చున్
వెన్నెముక తానై ప్రేమలనుఁ బంచెన్
కన్నకల లందున్ కాపరిఁగ మారున్
నాన్న మనసేగా నమ్మగలఁ బ్రేమౌ (1)
చిన్న అడుగుల్ నా చేత నడిపించే
"చిన్న" యని తోడై చిక్కులను తీయున్
మిన్నయగు మాటల్ మేలుయని చెప్పెన్
నాన్న మనసేగా నమ్మగల ప్రేమౌ (2)
ఎన్ని తలపుల్ తాఁ నే విధముఁ దల్చున్
ఎన్ని వలపుల్ తాఁ నీ విధము పంచున్
ఎన్ని కలతల్ తాఁ నే విధముఁ గాచెన్
నాన్న మనసేగా నమ్మగల ప్రేమౌ (3)
కన్నులను దాచే కల్పతరువంటూ
ఎన్నగల శక్తే యేపుగనుఁ నిచ్చున్
మన్ననలు పొందే మార్పులనుఁ జూపెన్
నాన్న మనసేగా నమ్మగల ప్రేమౌ (4)
********************************************
గణనాథ పద్య లక్షణములు
వృత్తం రకానికి చెందినది
జగతి ఛందమునకు చెందిన 911 వ వృత్తము.
12 అక్షరములు ఉండును.
18 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I I - I U U - U I I - I U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు భ , య , భ , య గణములుండును.
మల్లేశ్వరరావు పొలిమేర
06.16.2019

Sunday, June 16, 2019

Five years of journey With coffee ...

Five years of journey
With coffee ...
*****************************
Five years of journey
Strive to achieve many 
Diving into pleasant smell
Thriving into coffee carnival
A day used to start
Without a coffee
Now every day it includes
Like co-friends co-ff-ee
Dark roast, light roast
Chemex or Expresso
Mark it like a best place
To meet nice people and so
Growing challenges are
Brewing my abilities
Throwing innovation is
Proving my presence
*****************************
Malleswara Rao Polimera
06.16.2019

Thursday, May 30, 2019

Sridhar - 2

JBL support 03794921

శ్రీధరునికి నా నివాళులు, ఏది ఏమైనా 
"స్వాగత" మిచ్చుటయే మన విధి.

*******************స్వాగతం ****************************

న్యాయదేవతను న్యాయము కో రా
ప్రాయమివ్వమని ప్రార్థన జేస్తూ
చేయిచాచినను శ్రీధరునందున్
శ్రేయమైనదని జీవుని కోరెన్  (1)

జీవనమ్మునకు చేరిన టెక్షాన్
సేవనిత్యమని చేరిన శాఖన్
భావజాలముల బంధము తోడన్
త్రోవ పంచుటకు తోడయి నాడే (2)

మాటలందునను మంచిని జూపెన్ 
తోటి వారికిని తోడుగ నుంటూ
ఆటలందు తను అందుచు బాలల్
మేటియౌచు తను మీటె మనమ్ముల్ (3) 

విందు జీవితము బిడ్డల కిచ్చే
పొందు లెన్నియునొ పోగుగ పోసే
చిందు లెన్నియునొ చెంతన పోసే 
అంది వార్తలిటు నంతనె వీడెన్ (4)

వారమవ్వగనె వాలుతు శాఖన్
తీరుతెన్నులను తెల్పిన వాడై
చేరువవ్వగల శ్రీధర పల్కుల్
వేరు చేయనటి విశ్వపు ఛాయల్ (5)

వందనమ్ము లివి బంగరు బిడ్డా
వందనమ్ము లివి ప్రజ్వల పుత్రా
వందనమ్ములివి భాగ్యపు పుత్రా
వందనమ్ములివి భారత బిడ్డా  (6)

***********************************************

స్వాగతం పద్య లక్షణములు
వృత్తం రకానికి చెందినది
త్రిష్టుప్పు ఛందమునకు చెందిన 443 వ వృత్తము.
11 అక్షరములు ఉండును.
16 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I U - I I I - U I I - U U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు 7 వ అక్షరము యతి స్థానము
ప్రతి పాదమునందు ర , న , భ , గా(గగ) గణములుండును.

మల్లేశ్వరరావు పొలిమేర
05.30.2019

Saturday, May 18, 2019

Sridhar 1

నా మిత్రుడు తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ ...
**********************************నాగర (నాగరక)*****************************
మాటలు రాని రోజయే
నేటికి నమ్మలేనుగా
తోటి సహాయకుండు కా
చేటగు సుస్తి చేసినన్ / కేన్సరొచ్చినన్   (1)

శాఖను మేము మైత్రితో
రేఖలు లేని నాప్తులౌ 
ఆఖరు మాకు శోకమౌ
లేఖిని, కార్చి బిందువుల్   (2)

లేఖిని = కలము

ఆడిన యాట లెన్నియో
పాడిన పాట లెన్నియో
తోడగు వారి వేళలన్
నేడును గుర్తు కొచ్చెరా  (3)

శ్రీధర నీకు తోడుగా
ఈ ధర యందు యుంటుమీ
సాధన చేయు యత్నమున్
బాధక మేమి లేకయే  (4)

ధర = నేల

ఎందుకు జీవి తాలిలా
ఎందరి వేద నౌనురా 
అందని వైద్య విద్యలై
అందరి యమ్మ వారయే (5)

ఎంతటి వారి నైననూ
పొంతన లేని శోకముల్
వింతలు కాంచి వేదనల్
మంతన మందు చింతలే (7)

వేడెద గౌరి పార్వతిన్
వేడెద గౌరి శంకరున్
వేడెద నే వినాయకన్
వేడెద కోలుకొమ్మనిన్  (8) 

***************************************************************
నాగర (నాగరక)
ఈ పద్య ఛందస్సుకే నాగరక అనే ఇతర నామము కూడా కలదు.
వృత్తం రకానికి చెందినది
అనుష్టుప్పు ఛందమునకు చెందిన 87 వ వృత్తము.
8 అక్షరములు ఉండును.
12 మాత్రలు ఉండును.
మాత్రా శ్రేణి: U I I - U I U - I U
4 పాదములు ఉండును.
ప్రాస నియమం కలదు
ప్రతి పాదమునందు భ , ర , వ(లగ) గణములుండును.

మల్లేశ్వరరావు పొలిమేర
05.18.2019

Tuesday, January 1, 2019

HAPPY NEW YEAR 2019

HAPPY NEW YEAR 2019
నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2019 వృత్తములో
*****************నటహంస ********************
వచ్చెరా యీ రోజు పయనమయి నీతో
తెచ్చెరా యానంద దినములను కూడా
మచ్చుకై యా నాడు మలచు ప్రతి నేడున్
విచ్చుకౌ యేడాది విలసితము కాదా! (1)
కీడులన్ సంద్రమ్ము కెరటమున పోసీ
వాడిగా కొంగ్రొత్త వలపులను చూసీ
తోడుగా చేపట్టు తొలకరి జయమ్ముల్
ఱేడులా యేడాది రెపరెపల నెన్నో (2)
శోభలన్ బంధమ్ము శుభములను కోరీ
శోభలన్ మిత్రమ్ము శుభములను కోరీ
శోభలన్ భూదేవి శుభములను కోరీ
శోభలన్ కాంక్షించు సుకవి మది మళ్ళీ/"మల్లీ"(3)
*************************************
నటహంస
వృత్తం రకానికి చెందినది
అతిజగతి చెందిన 2019 వ వృత్తము.
మాత్రా శ్రేణి: ర/త/న/స/గ UIU UUI - IIIII UU
13 అక్షరములు ఉండును.
ప్రాస నియమం కలదు
మల్లేశ్వరరావు పొలిమేర
12.31.2019