********************ఇంద్రవంశము**********************
నా బాల్య మందున్నటి నాటిరోజులై
ఏ బాట లేకుండుట యిట్టి రోజులై
ఆబాలగోపాలము లాడు రోజులై
మాబాగు లోకమ్మయి మంచి రోజులౌ (1)
ఆబాలగోపాలము = చిన్నలు మొదలు పెద్దల వఱకు
మాబాగు = very well
లోకమ్ము నేలున్నను లోటు లేదురా
శోకమ్ము లేకుండను చూడు సోదరా
నీ కళ్లముందుండునె నీ కుటుంబమై
నీ కంటి ప్రేమౌనుగ నిన్ను దల్చుచున్ (2)
అందాల లోగిల్లను హత్తుకుండుచున్
బంధాల ముంగిల్లను పంచుచుండురా
విందంటు ముందుండు నవే మమేకమై
మందంటు ముందుండిన మంచి గుర్తులౌ (3)
నీ భోగభాగ్యమ్ములు నీకు నిచ్చునా?
నీ భార్య నీ బిడ్డలు నీకు దగ్గరై
నీ భాగ్యవంతమ్మును నిగ్గుచుండుగా
నీ భారమంతా కననియ్యకుండుగా (4)
కష్టమ్ము లౌచున్నను కాంచు మంచినే
ఇష్టమ్ము లేకున్నటి ఈర్ష్య లేలరా
స్పష్టమ్ము గా నిప్పుడు సాయమిచ్చుచున్
సృష్టించు నీజాతిని వృద్ధి చేయరా (5)
******************************************
ఇంద్రవంశము(ఇన్దువంశా)
ఇంద్రవంశము పద్య లక్షణములు
- ఈ పద్య ఛందస్సుకే ఇన్దువంశా అనే ఇతర నామము కూడా కలదు.
- వృత్తం రకానికి చెందినది
- జగతి ఛందమునకు చెందిన 1381 వ వృత్తము.
- 12 అక్షరములు ఉండును.
- 19 మాత్రలు ఉండును.
- మాత్రా శ్రేణి: U U I - U U I - I U I - U I U
- 4 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- ప్రతి పాదమునందు 8 వ అక్షరము యతి స్థానము
- ప్రతి పాదమునందు త , త , జ , ర గణములుండును.
No comments:
Post a Comment